గృహలక్ష్మి సీరియల్ నటి అంకిత రియల్ లైఫ్…ఎన్ని సినిమాల్లో నటించిందో…?
Gruhalakshmi serial actress Ankitha : టివి సీరియల్స్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వడంతో మంచి ఆదరణకు నోచుకుంటున్నాయి. ఇక స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్ కొద్దికాలంలోనే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. బాగా పాపులర్ అయిన ఈ సీరియల్ లో అంకిత తన అందంతో, అభినయంతో ఆకట్టుకుంటోంది.
పాజిటివ్, నెగెటివ్ రెండు రోల్స్ లో నటించి మెప్పిస్తున్న అంకిత అసలు పేరు శిరీష. జులై 20న మచిలీపట్నంలో జన్మించిన శిరీష సెయింట్ మేరీస్ కాలేజీలో బిఎ జర్నలిజం పూర్తిచేసింది. ఈమెకు ఓ సిస్టర్ ఉంది. ఇక తండ్రి శ్రీను మాటీవీలో ప్రొగ్రామింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. తండ్రి టివిలో పనిచేయడం, శిరీషకు యాక్టింగ్ అంటే ఇష్టం ఉండడంతో ఇంటర్ చదువుతున్న సమయంలోనే బుల్లితెరమీద ఎంట్రీ ఇచ్చింది.
శిరీష మంచి నటి మాటమే కాదు మంచి డాన్సర్ కూడా. జెమినిలో ప్రసారమైన రంగస్థలం డాన్స్ షోలో పాల్గొని అలరించింది. సీరియల్స్ కి ముందు కొన్ని సినిమాల్లో వేసింది. నారా రోహిత్ నటించిన తుంటరి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ వేసిన ఆతర్వాత ప్రేమమ్ మూవీలో చిన్న వేషం వేసింది. తోడికోడళ్లు సీరియల్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శిరీష ఆతర్వాత అభిషేకం, కృష్ణవేణి, ప్రతిఘటన, రామసక్కని సీత వంటి సీరియల్స్ లో నటిసొంది.