మణికట్టు, అరచేతి నొప్పి తగ్గాలంటే…Best Tips
Hand and wrist pain :కంప్యూటర్‌పై అదేపనిగా పనిచేయడం వల్ల మీడియన్ నర్వ్ అనే నరం మణికట్టు వద్ద ఒత్తిడికి లోనై కొందరిలో అరచేతి వేళ్లలో నొప్పి వస్తుంది.
ఆ నొప్పిని కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. ఇది కాస్త ఎక్కువే విసిగిస్తుంది కానీ, కాస్త జాగ్రత్తగా ప్రయత్నిస్తే దీన్నుంచి విముక్తి పొందవచ్చు. అందుకు ఏం చేయాలంటే…
నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే చన్నీళ్లతో గాని, ఐస్‌తో గాని కాపడం పెట్టాలి.
చన్నీళ్ల కాపడం తర్వాత వేణ్ణీళ్ల కాపడం కూడా పెట్టవచ్చు. అప్పుడు నొప్పి తీవ్రత మరింత తగ్గుతుంది.
ఆ తర్వాత స్క్రేప్ బ్యాండ్‌తో మణికట్టు కదలకుండా కట్టు వేసి ఉంచుకోవాలి. దీనికోసం మార్కెట్లో దొరికే రిస్ట్ సపోర్టర్ కూడా వాడవచ్చు.
కంప్యూటర్‌పై అదేపనిగా పని చేయడం వల్లనే ఇది వస్తుంది కాబట్టి నొప్పి తగ్గేవరకు మణికట్టుకు విశ్రాంతి ఇవ్వాలి.
పై చర్యల తర్వాత కూడా నొప్పి తగ్గకపోతే ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించాలి.