ఈ విలన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు అవకాశాలు లేక ఏమి చేస్తున్నాడో…?
Telugu villain anand raj :తమిళ నటుడు ఆనంద్ రాజ్ తెలుగులో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, కింగ్ నాగార్జున తదితర స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్ర పోషించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. భయంకరమైన విలనిజంలో భయపెట్టాడు. 1998లో ఆనంద్ రాజ్ సినీ ప్రస్థానం మొదలైంది. తెలుగులో మొదటగా ప్రముఖ సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన “ముద్దుల మావయ్య” మూవీలో ఆనంద్ రాజ్ విలన్ గా నటించి టాలీవుడ్ సినిమా పరిశ్రమకి విలన్ గా పరిచయం అయ్యాడు.
ఆ తర్వాత లంకేశ్వరుడు, ఒంటరి పోరాటం, గ్యాంగ్ లీడర్, పెదరాయుడు, భాషా, తదితర చిత్రాలలో విలన్ గా నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో కట్టి పడేసాడు. ఒకప్పుడు వరుస సినిమా అవకాశాలతో సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆనంద్ రాజ్ ప్రస్తుతం కమెడియన్ పాత్రలకి పరిమితమయ్యాడు. ఇటీవలే జాక్ పాట్ చిత్రంలో కామెడీ రోల్ ని పోషించిన ఆనంద్ రాజ్ బెస్ట్ కమెడియన్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు.
ఇక ఆ మద్య తమిళ ప్రముఖ హీరో విజయ్ హీరోగా నటించిన విజిల్ చిత్రంలో కనిపించాడు. దాదాపుగా 300కు పైగా చిత్రాల్లో విలన్ పాత్రలను పోషించి పలు అవార్డులను కూడా అందుకున్నాడు.అయితే ప్రస్తుతం ఆనంద రాజ్ తన కూతురిని నటిగా సినిమా పరిశ్రమకు పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. కొన్ని సినిమాల్లో మెయిన్ లీడ్ పాత్రలలో కూడా నటించి సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.