కార్తీక దీపం సీరియల్ హిమ నిజ జీవితంలో ఎన్ని కష్టాలో…?
karthika deepam serial hima :బుల్లితెర సీరియల్స్ చూసేవాళ్లకు కార్తీక దీపం గురించి చెప్పక్కర్లేదు. అంతలా ఆడియన్స్ ని ఈ సీరియల్ ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ లో నటించే ప్రతి క్యారెక్టర్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఒకరిని మించి మరొకరు నటిస్తున్నారు. ఇందులో పెద్దవాళ్ళే కాదు, బాలనటులుగా చేస్తున్న హిమ లాంటి వాళ్లకు కూడా మంచి పేరు వచ్చింది.
ఈ సీరియల్ లో కవల పిల్లల్లో చిన్నదైన హిమను పుట్టినప్పుడే దీపనుంచి సౌందర్య దూరం చేసి, అనాధగా కార్తీక్ దగ్గరకు తీసుకువస్తుంది. ఆమెను కార్తీక్ చాలా గారాబంగా పెంచుతాడు. అయితే తన బిడ్డేనని తెలుసుకున్న దీప తన బిడ్డను తాను తీసుకుపోతానని చెప్పి, తీసుకెళ్లిపోతుంది. ప్రస్తుతం దీప దగ్గరే హిమ ఉంటుంది. పుట్టినపుడు అమ్మకు, పెరుగుతున్నపుడు నాన్నకు దూరంగా ఉంటున్న హిమ నిజ జీవితంలో కూడా అలాంటి కష్టాన్నే ఎదుర్కొంది.
స్టార్ మాలో సంక్రాంతికి వచ్చిన స్పెషల్ ప్రోగ్రాం లో తన తల్లిని తీసుకుని వచ్చిన హిమ తన అసలుపేరు సహృద అని చెప్పింది. ఇక సహృద గురించి ఆమె తల్లి ఓ విషయం చెబుతూ ఎమోషన్ కి గురయ్యింది. ఆడపిల్ల పుట్టిందని సహృదను చూడ్డానికి కూడా తండ్రి రాలేదని చెప్పింది. అక్కడున్న వాళ్లంతా ఎమోషన్ కి గురయ్యారు. దీంతో యాంకర్ రవి స్పందిస్తూ కూతురు అంటే పదిమంది అబ్బాయిలతో సమానమని చెబుతాడు.