సింహ విలన్ గుర్తు ఉన్నాడా…ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?
Tollywood villain sai kumar :మలయాళ చిత్రాల్లో రాణిస్తూ, తెలుగులో సింహ సినిమాలో విలన్ గా నటించి బాగా క్రేజ్ తెచ్చుకున్న నటుడు సాయికుమార్ పలు డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ఆడియన్స్ కి అంతకుముందే దగ్గరయ్యాడు. 150 మలయాళ సినిమాల్లో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న మలయాళ నటుడైన కొట్టారక్కర శ్రీధరన్ నాయర్ కి జన్మించిన సాయికుమార్ 1977 లో విడుదలయిన ‘విదరుణ మోత్తుకల్’ మూవీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండి తెరకు పరిచయం అయ్యాడు. తొలుత కమెడియన్ గా నటించిన ఆయన ఆ తర్వాత మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాడు. 2007లో విడుదలైన ‘ఆనందభైరవి’ మూవీలో సాయికుమార్ కనబరిచిన నటనకు విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ మూవీలో నటనకు ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు దక్కింది. ఇంకా ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనా ప్రదర్శన చూపించి ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. సాయి కుమార్ సినీ కెరీర్ సాఫీ గానే సాగినప్పటికీ అతడి వ్యక్తిగత జీవితం మాత్రం ముళ్ళ మీద నడకగా మారింది. సాయి కుమార్ డ్రామా ట్రూప్ లో చేరి నాటకాలు వేస్తున్న సమయంలో ఆయనకి ప్రసన్నకుమారితో పరిచయం ఏర్పడింది. అనేక నాటకాల్లో హీరో హీరోయిన్లుగా నటించిన వీరి మధ్య పరిచయం ప్రేమగా మారి, ఆతర్వాత పెళ్ళికి కూడా దారి తీసింది. కొన్నాళ్ళు అన్యోన్యంగా తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించారు.
ఈ దంపతులకు వైష్ణవి అనే కూతురు కూడా పుట్టడంతో ప్రసన్నకుమారి సినిమాలు మానేసి తన కూతురు ఆలనాపాలనా చూసుకోవడం ప్రారంభించారు. హఠాత్తుగా ఏమైందో ఏమోగానీ ఒకరోజు తన భార్య తనని మోసం చేసిందని మండిపడి కొచ్చి లోని ఒక అపార్ట్మెంట్ తీసుకొని సాయికుమార్ విడిగా జీవించడం స్టార్ట్ చేసాడు. కాగా సాయి కుమార్ కి ప్రముఖ నటి శోభ మోహన్ అక్క . విను మోహన్ అల్లుడు అవుతాడు. ఇలా చూసుకుంటే సాయికుమార్ కుటుంబం నుంచి మొత్తం నలుగురు చిత్ర పరిశ్రమలో ఉన్నారు.
వీరికి గొడవలు ఎక్కువ కావటంతో సాయికుమార్ తన భార్యతో 2008లో విడాకులు తీసుకొని 2009వ సంవత్సరంలో మలయాళీ కమెడియన్ బిందు పనికిర్ ను పెళ్లి చేసుకున్నారు.