MoviesTollywood news in telugu

జబర్దస్త్ రెమ్యునరేషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అప్పారావు

jabardasth apparao :ఒకప్పుడు వెండితెరపై కనిపించే హాస్యం కాలక్రమేణా బుల్లితెర పై ప్రత్యక్షం అయింది. దానికి తోడు జబర్దస్ లాంటి కామెడీ షో కావడంతో బుల్లితెర ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకూ టాప్ రేటింగ్ తో జబర్దస్త్ షో దూసుకెళ్తూ టాప్ షో గా రాణిస్తోంది. దీనికి పోటీగా ఎన్ని వచ్చినా జబర్దస్త్ ముందు బలాదూర్ అయ్యాయి. ఇక జబర్దస్త్ పుణ్యమాని ఇందులో నటించే వాళ్లకు క్రేజ్ తో పాటు ఆర్ధికంగా కూడా మంచి లాభసాటి అయింది. ఇతర షోస్ లో కూడా ఛాన్స్ లు కొట్టేసారు. కొందరు అయితే సినిమాల్లో కూడా చేస్తున్నారు. అంతలాగా జబర్దస్త్ కామెడీ షో కంటెస్టెంట్స్ పాలిట వరంగా మారింది.

ఇటీవల కాలంలో అందరికీ రిమెన్యురేషన్ డబల్ చేస్తారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. జబర్దస్త్ కమీడియన్స్ కి లక్షల్లోనే రెమ్యూనరేషన్లు అందుతున్నట్లు చమ్మక్ చంద్ర వాళ్ళు ఇప్పటికే చెప్పారు. కాగా జబర్దస్త్ కామెడీ షో కీలకంగా ఉన్న ఒక టీం లీడర్ అప్పారావు ప్రతి ఈవెంట్లో కూడా అప్పారావు లేకుండా ఉండదన్న పేరును సొంతం చేసుకున్నాడు. ఓ షో లో ఒక ప్రముఖ యాంకర్ అడిగిన ప్రశ్నకు రెమ్యునరేషన్ విషయంలో కొన్ని నిజాలు వెల్లడించాడు. జబర్దస్త్ షో కారణంగా మేము బాగానే సంపాదించుకుంటున్నామని అలాగే బయట కూడా మాకు మంచి పేరు ఉందని అప్పారావు చెప్పాడు. కామెడీ షో మాత్రమే కాకుండా ఈవెంట్స్ లో పాల్గొనే ఛాన్స్ వస్తోందని, దానిని బట్టి రేటు కూడా ఉంటుందని చెప్పాడు.

ఇక 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నా కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కేవలం జబర్దస్త్ షో ద్వారా మంచి పేరు లభించింది. అందరితోపాటు భారీగానే రెమ్యునరేషన్ వస్తుంది. పైగా హైపర్ ఆది, సుధీర్ లాంటివాళ్ళు తన కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు’ అని అప్పారావు చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ లో టీం లీడర్ గా వ్యవహరిస్తున్నట్లు లక్షల్లో రెమ్యూనరేషన్ వస్తున్నట్లు ఇండైరెక్ట్ గా తెలియజేశాడు. కరోనా సమయంలో కూడా షెడ్యూల్ ప్రకారం డబ్బులు వచ్చాయి. రెమ్యూనరేషన్ విషయంలో మల్లెమాల పర్ఫెక్ట్’అని వివరించాడు.