ఈ ఫొటోలో మెగాస్టార్ తో పాటూ కనిపిస్తున్న బుడ్డోడు ఎవరో గుర్తు పట్టారా?
chiranjeevi and varun tej :టాలీవుడ్ కి మెగా బ్రదర్ కొడుకుగా ముకుంద సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే తానేమిటో నిరూపించుకున్నాడు వరుణ్ తేజ్. ఆ తర్వాత వరుణ్ తేజ్ కంచె, ఫిదా, ఎఫ్2 సినిమాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా చిరు షేర్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ ఫోటో వరుణ్ తేజ్ చిన్నప్పుడు మెగాస్టార్ తో దిగినది. చిరు షేర్ చేసిన కొద్ది సమయంలోనే లక్షల సంఖ్యలో లైకులు కామెంట్లు వచ్చాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చినటువంటి ఎఫ్2 సీక్వెల్ గా వచ్చిన “ఎఫ్3” చిత్రంలో కూడా వరుణ్ తేజ్ కి మంచి పేరును తెచ్చిపెట్టింది.