MoviesTollywood news in telugu

సునీతకి హీరోయిన్ గా ఎంతమంది దర్శకులు ఆఫర్ ఇచ్చారో…?

Singer Sunitha : సింగర్ సునీత ఎన్నో వేల పాటలను పాడటమే కాకుండా ఎంతో మండి హీరోయిన్ లకు గాత్ర దానం చేసింది. ఇటీవల సునీత రామ్ వీర‌ప‌నేనిని వివాహం చేసుకొని వివాహ బందంలోకి అడుగు పెట్టారు. ఇప్పటివరకు సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్, వ్యాఖ్య‌త‌గా మాత్ర‌మే ప‌నిచేసిన సునీత ఇప్పుడు వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టారు.

ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను సునీత చెప్పారు. తనకు సినిమా అవకాశాలు వచ్చాయని ఆసక్తి లేక అటు వైపు అడుగులు వేయలేదని చెప్పారు. ఈ వేళ‌లో నీవు పాట పాడిన త‌రువాత రామ్ గోపాల్ వ‌ర్మ స్కూల్ నుంచి నాకు హీరోయిన్‌గా ఆఫ‌ర్ వ‌చ్చింది. ఆ త‌రువాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి త‌న‌కు హీరోయిన్‌గా అవ‌కాశం ఇచ్చారు.