Brown Sugar For Skin:మృదువైన, మెరిసే చర్మం పొందడానికి, బ్రౌన్ షుగర్‌తో ఇలా చేయండి!
Brown Sugar For Skin:బ్రౌన్ షుగర్ అంటే ముడి చక్కెర. మనం ప్రతిరోజు చక్కెరను ఏదో రకంగా వాడుతూనే ఉంటాం. కాఫీ టీ పాలు జ్యూస్ వీటిల్లో వేసుకుని తీసుకుంటూ ఉంటాం.
ఇటీవల కాలంలో వైట్ చక్కెర మంచిది కాదని బ్రౌన్ షుగర్ వాడటం మొదలు పెట్టారు. వైట్ షుగర్ తో పోలిస్తే బ్రౌన్ షుగర్ ఆరోగ్యానికి కూడా మంచిది. ఆరోగ్యానికే కాకుండా బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ముఖం జిడ్డు లేకుండా కాంతివంతంగా ఉండాలి అంటే బ్రౌన్ షుగర్ బాగా సహాయపడుతుంది.
బ్రౌన్ షుగర్ ని పొడిచేసి దానిలో కొంచెం బియ్యప్పిండి కొంచెం పాలు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలి అరగంట అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
చర్మంపై మృతకణాలు తొలగిపోయి ఉంటే ఈ ప్యాక్ ఫాలో అవ్వాలి బ్రౌన్ షుగర్ పొడిలో కొంచెం తేనె కలిపి ముఖానికి పట్టించి నిదానంగా రబ్ చేయాలి . అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.