నిహారిక వేసవి కోసం ఎదురుచూసేది ఎందుకో తెలుసా ?
Niharika Konidela : రాజకీయాల నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి వరుసగా చేస్తున్న 3వ సినిమా ఆచార్య. ఇప్పటికే రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య టీజర్ విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. రామ్ చరణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. యూట్యూబ్ లో ఈ టీజర్ కు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. 65 సంవత్సరాల వయస్సులో చిరంజీవి ఎనర్జీని చూసి ఫ్యాన్స్ సైతం అవాక్కవుతున్నారు.ఈ మూవీలో చిరంజీవికి కాజల్ అగర్వాల్ జోడీ కడుతోంది. ఇక చెర్రీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నట్లు టాక్. ఇక ఈ ఏడాది మే 13వ తేదీన ఆచార్య సినిమా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ ప్రముఖుల నుంచి కూడా ఆచార్య మూవీ టీజర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పైగా కొరటాల శివ డైరెక్షన్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో ఈ సినిమా కూడా మరో బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని మెగా ఫాన్స్ నమ్మకంగా ఉన్నారు. సాధారణంగా సమ్మర్ వస్తే, పరీక్షలు పూర్తై సెలవులు రావడం వల్ల ఎంజాయ్ చేయొచ్చని విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తారు. కానీ ఈసారి కరోనా ఎఫెక్ట్ తో సమ్మర్ లేనట్లే. సమ్మర్ లో కూడా క్లాసులు , పరీక్షలు జరగబోతున్నాయి.
ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, తమ సినిమాలను సమ్మర్ లోనే విడుదల చేయాలని భావిస్తారు. ఇక గత డిసెంబర్ లో అంగరంగ వైభవంగా జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న మెగా డాటర్ నిహారిక కూడా తాను సమ్మర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని చెప్పింది. ఎందుకంటే,ఆచార్య టీజర్ చూసిన నిహారిక ట్విట్టర్ ద్వారా టీజర్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ,.. ఆచార్య టీజర్ ఫంటాస్టిక్ గా ఉందని, సమ్మర్ కోసం తాను ఎదురు చూస్తున్నానని చెప్పింది. పైగా పెదనాన్న చిరంజీవి, అన్నయ్య రామ్ చరణ్ కల్సి నటించిన సినిమా కదా. కాగా ఈ మూవీలో చెర్రీ పాత్ర 40 నిమిషాలు, పూజా హెగ్డే రోల్ 20 నిమిషాలు ఉంటుందని చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది.