కళ్యాణ వైభోగంలో మంగ,జైలను తొందరగా కలవకపోవటానికి కారణం…!?
Kalyana Vaibhogam serial :జీ తెలుగు ఛానల్ లో వస్తున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ లో హీరోగా చేస్తున్న శ్రీరామ్ వెంకట్ ఇదే చానల్ లో ప్రసారమవుతున్న కల్యాణ వైభోగం సీరియల్ కి ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. అయితే ఓ సీరియల్ లో హీరోగా రాణిస్తూ మరో సీరియల్ ని నిర్మించి సూపర్ హిట్ గా మలచడం మామూలు విషయం కాదు.
ఈ నేపథ్యంలో శ్రీరామ్ వెంకట్ కొన్ని ఆసక్తికర అంశాలను లైవ్ లో ఫాన్స్ తో షేర్ చేసుకున్నాడు. కల్యాణ వైభోగం సీరియల్ ని ఎందుకు సాగదీస్తున్నారని, జై,మంగ ని ఎందుకు తొందరగా కలపలేదని ఓ అభిమాని ప్రశ్నించాడు. దీనికి వెంకట్ బదులిస్తూ ఫాన్స్ లో దీనిపై ఉత్కంఠ ఉన్న మాట నిజమేనన్నాడు.
అయితే తామేమీ సీరియల్ ని సాగదీయడం లేదని, అభిమానుల ఆదరణను బట్టి కొనసాగించడం సహజమని శ్రీరామ్ వెంకట్ చెప్పుకొచ్చాడు. ఆడియన్స్ బోర్ ఫీలవుతుంటే, వారు కోరుకున్న విధంగా కథను చేంజ్ చేస్తాం అని కూడా చెప్పాడు. ఇప్పటివరకూ చూస్తున్నారంటే బోర్ కొట్టాడకుండా తీస్తున్నామని అర్ధం. అలా తీయడం తమ ధర్మం అని కూడా చెప్పాడు. ఇక ఆడియన్స్ కోరుకున్నట్టుగానే జై,మంగ కలుసుకున్నారు. అయితే మంగ కు గతం గుర్తుకు రాలేదు