కమెడియన్ సునీల్ భార్యను ఎప్పుడైనా చూసారా…ఏమి చేస్తుందో తెలుసా?
Comedian Sunil Wife :కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కమెడియన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారి తనకంటూ సొంత మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. సునీల్ టాలీవుడ్ లో పెద్ద విలన్ గా పేరు తెచ్చుకోవాలని అనుకున్నాడు కానీ టాప్ కమెడియన్ గా అయిపోయాడు నువ్వేకావాలి సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాడు. సునీల్ పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఎవరికీ తెలీదు సినిమాల్లోకి రాక ముందు భీమవరంలో ఉండేవాడు
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే సునీల్ పెళ్లి చేసుకున్నాడు అయితే ఆయన భార్య గురించి గానీ కుటుంబం గురించి కానీ పెద్దగా ఎవరికీ వివరాలు తెలియదు. సునీల్ తండ్రి ఐదు సంవత్సరాల వయసులోనే చనిపోతే తల్లి సునీల్ ని పెంచింది. సునీల్ టాలీవుడ్ కి వచ్చిన కొత్తలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశాడు. సునీల్ భార్య పేరు శృతి ఇందుకూరి.ఈమె ఫోటోలు కూడా పెద్దగా కనిపించవు సునీల్ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు సునీల్ ఫ్యామిలీ పెద్దగా బయటకు కనబడదు 45 ఏళ్ల సునీల్ కి ఒక పాప ఒక బాబు ఉన్నారు.