సుశాంత్ మిస్ చేసుకున్న సినిమాలు ఎన్ని హిట్ అయ్యాయో తెలుసా?
sushant singh rajput rejected Movies : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అప్పుడే బాలీవుడ్ లో ఎదుగుతూ స్టార్ హీరో గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస ఆఫర్లతో ఫాన్స్ ని కూడా పెంచుకున్నాడు. అయితే యితడు చేయాల్సిన సినిమాలు కొన్ని చేజారతాయి. సుశాంత్, కృతిసనన్ జంటగా రావాల్సిన హాఫ్ గర్ల్ ఫ్రెండ్ చిత్రం వేర్వేరు కారణాల వల్ల అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్ చేతికి వెళ్లింది. రణవీర్ సింగ్ హీరోగా నటించి హిట్టైన బేఫికర్ సినిమాలో కూడా సుశాంత్ నటించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మరో హీరో చేతికి వెళ్లింది. అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాలో మొదట సుశాంత్ కే అవకాశం దక్కింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్టైన అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో మొదట సుశాంత్ కు ఛాన్స్ దక్కగా ఆ తరువాత ఆ సినిమా చేతులు మారింది. సుశాంత్ సింగ్ నో చెప్పడంతో ఆ సినిమా మరో హీరో చేతికి వెళ్లిందని తెలుస్తోంది. రామ్ లీలా సినిమా కథను కూడా మొదట సుశాంత్ విన్నాడని అయితే సుశాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా రణవీర్ చెంతకు చేరిందని టాక్. ఫితూర్ సినిమా కథ నచ్చినప్పటికీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అప్పటికే వేరే సినిమాకు కమిట్ కావడంతో అందులో నటించలేకపోయాడు.
ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధాధూన్ సినిమాలో కూడా సుశాంత్ నటించాల్సి ఉంది. అయితే అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆయుష్మాన్ ఖురానా దగ్గరకు వెళ్లడం అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. అలా మిస్ అయింది. ఇక రోమియో అక్బర్ వాల్టర్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ ను కూడా సుశాంత్ కి మిస్సయింది. అయితే ఎవరూ ఊహించని విధంగా స్టార్ హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో సుశాంత్ సింగ్ గతేడాది జూన్ నెల 14వ తేదీన ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీని కుదిపేసింది. ఈ మృతికి వేర్వేరు కారణాలు వినిపించడంతో సిబిఐ విచారణ చేస్తున్నారు.