MoviesTollywood news in telugu

మెగా ఆఫర్ ని రెజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్…కారణం ఎవరో తెలుసా?

Chiranjeevi New Movie :సినిమా ఇండస్ట్రీలో వచ్చే గాసిప్స్ మరెక్కడా కనపడవు. కొందరు రియాక్ట్ అవుతారు. కొందరు అస్సలు పట్టించుకోరు. ఇందులో కొన్ని నిజాలుంటాయి. మరికొన్ని పచ్చి అబద్ధాలుంటాయి. రాజకీయాలనుంచి రీ ఎంట్రీ ఇచ్చాక ఖైదీ నెంబర్ 150తో బాస్ ఈజ్ కమ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ చిరంజీవి తన స్టామినా చూపించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ చేసింది. తదుపరి మూవీ ‘సైరా నరసింహారెడ్డి’తో మెప్పించిన చిరంజీవి కి జోడీగా నయనతార నటించింది. ఇక 152వ మూవీగా కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య మూవీ చిరంజీవి చేస్తున్నాడు.

తర్వాత సినిమాగా ‘లూసిఫర్’ రీమేక్ లో చేయాలన్నది చిరంజీవి ప్లాన్. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ – సూపర్ గుడ్ ఫిలిమ్స్ – ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ పై ఆర్.బి చౌదరి – ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘తని వరువన్’ ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే చిరంజీవి కెరీర్ లో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మిగతా ప్రధాన పాత్రల్లో ఎవరు నటిస్తారనే దానిపై అనేక రూమర్స్ వస్తున్నాయి. ముందుగా ఈ రీమేక్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ని తీసుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. నిజానికి మలయాళ వర్షన్ లో హీరోకి జోడీ ఉండదు. కానీ తెలుగులో చిరు ఇమేజ్ , మెగా ఫాన్స్ ని దృష్టిలో పెట్టుకొని తమిళ దర్శకుడు మోహన్ రాజా హీరోయిన్ పాత్రను క్రియేట్ చేసాడట. అయితే ప్రాధ్యాన్యత లేని పాత్ర ఎందుకని నయన్ మెగా ఆఫర్ ని రిజెక్ట్ చేసిందని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. నయన్ ఆ పాత్రను తిరస్కరించడంతో చిత్ర యూనిట్ మరో హీరోయిన్ వేటలో పడ్డారట. ఏది ఏమైనా అధికారికంగా మాత్రం క్లారిటీ లేదు.