MoviesTollywood news in telugu

ఐస్ క్రీమ్ తింటున్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా..?

Abhishek bachan child hood photos :అది ఏ ఇండస్ట్రీ అయినా కావచ్చు స్టార్ హీరోలతో పాటు వారి పిల్లలకు సంబందించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వస్తే తెగ వైరల్ అవుతాయి. స్టార్ హీరోల చిన్నప్పటి ఫోటోలు పెడితే క్షణాల్లో నెట్టింట్లో హల్ చల్ చేస్తాయి. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా, తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న అభిషేక్ బచ్చన్ నిజానికి బిగ్ బి, సూపర్ స్టార్ అమితాబ్ తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి, కెరీర్ మొదట్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న అభిషేక్ ‘ధూమ్’ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నాడు. ఇక కరోనా పీక్ స్టేజ్ లో ఉండగా అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కరోనా బారిన పడగా, అమితాబ్, అభిషేక్ త్వరగానే కోలుకున్నారు.

ధూమ్ సిరీస్ లో తెరకెక్కిన ధూమ్ 2, ధూమ్ 3 కూడా అభిషేక్ కు మంచి ఇమేజ్ తెచ్చాయి. ప్రస్తుతం 45ఏళ్ళ వయస్సులో గల అభిషేక్.. ప్రపంచ సుందరి, ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ ను 2007 సంవత్సరంలో పెళ్లిచేసుకున్నాడు. వీరికి 2011లో ఆరాధ్య పుట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ, షూటింగ్ లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. అమితాబ్ తండ్రి హరివంశరాయ్‌ బచ్చన్ ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోను షేర్ చేసారు.

ఫోటోలో అభిషేక్ బచ్చన్ తాత, తండ్రిలను ఆసక్తిగా గమనిస్తున్నాడు. ఇక అభిషేక్ బచ్చన్ పుట్టినరోజు కావడంతో అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో ఈ అరుదైన ఫోటోలను షేర్ చేశారు. ఇందులో అభిషేక్ బచ్చన్ ఐస్ క్రీమ్ తింటున్న పిక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. చిన్నప్పుడు కెమెరా ముందుకు రావాలంటే తెగ సిగ్గుపడే అభిషేక్ ఆతర్వాత కాలంలో తన నటనతో అభిషేక్ విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. అభిషేక్ చిన్న వయస్సులో తాను వాడి చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తే, ప్రస్తుతం వాడు నా చేయి పట్టుకుని ముందుకు సాగిస్తున్నాడని అమితాబ్ ఆనందపడుతున్నారు.