ఈ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ ఎవరో మీకు తెలుసా ?
Telugu dubbing artist haritha : తెలుగులో కొత్త బంగారులోకం సినిమాలో హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ చెప్పిన డైలాగ్స్ కుర్రకారుని ఎంతలా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ డైలాగ్స్ సినిమా హిట్ కి కారణం అయ్యాయి. శ్వేతా బసు ప్రసాద్ కి డబ్బింగ్ ఆర్టిస్ట్ హరిత డబ్బింగ్ చెప్పింది.
హరిత ఈమధ్య ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పింది. హరిత పిన్ని సినిమాలలో హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పేది. ఆమెతో పాటు డబ్బింగ్ థియేటర్ కి వెళ్లడంతో హరిత కి కూడా డబ్బింగ్ మీద ఆసక్తి పెరిగింది. కొత్త బంగారులోకం సినిమా కి డబ్బింగ్ చెప్పాక కూడా అనేక సినిమాలకు డబ్బింగ్ చెప్పినా పెద్దగా గుర్తింపు రాలేదు.
అయితే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కిక్కు సినిమాలో హీరోయిన్ ఇలియానాకి డబ్బింగ్ చెప్పాక చాలా గుర్తింపు వచ్చిందని చెప్పింది. ఈ సినిమాలో హీరోయిన్ చెల్లెలు కి డబ్బింగ్ చెప్పడానికి వెళ్లానని తన వాయిస్ నచ్చి హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పమన్నారని చెప్పుకొచ్చింది.