Guppedantha Manasu Serial :గుప్పెడు మనసు సీరియల్ యాక్టర్ మహేంద్ర రియల్ లైఫ్
Guppedantha Manasu Serial :ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతూ కొద్దిరోజుల్లోనే పాపులర్ గా మారిన గుప్పెడు మనసు సీరియల్ విశేష ఆదరణతో నడుస్తోంది. తెలుగు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ లో ఋషికి తండ్రిగా నటిస్తున్న యాక్టర్ మహేంద్ర తన అందంతో తెరమీద ఆడియన్స్ ని మెప్పిస్తున్నాడు.
మహేంద్ర నిజానికి అందరికి తెల్సిన సినిమా హీరో. అతడి పేరు సాయికిరణ్. 1978 మే8న హైదరాబాద్ లో జన్మించాడు. తండ్రి రామకృష్ణ అప్పటిలో ప్రముఖ గాయకుడిగా సినిమాల్లో ఓ వెలుగు వెలిగారు.
5వేలకు పైగా పాటలు పాడి తెలుగు ప్రేక్షకుల ను ఆకట్టుకున్నారు. తల్లి జ్యోతి దూరదర్శన్ లో పలు సాంగ్స్ పాడారు. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద మక్కువ ఉండడంతో నువ్వేకావాలి మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. పెళ్లిచేసుకున్న సాయికిరణ్ భార్య పేరు వైష్ణవి. వీరికి ఒక కూతురు ఉంది.
ప్రేమించు, డార్లింగ్ డార్లింగ్, సత్తా, వెంగమాంబ, పెళ్లికోసం, జగపతి, దేవి అభయం, షిరిడి సాయి, జగద్గురు ఆదిశంకర తదితర సినిమాల్లో నటించాడు. ఆతర్వాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి, తెలుగు, తమిళ, మలయాళ సీరియల్స్ లో నటించి, ఆడియన్స్ కి దగ్గరయ్యాడు.
సుడిగుండాలు, ఆటో భారతి, శివలీలలు, అభిలాష, తదితర సీరియల్స్ లో నటించాడు. గాయకుడిగా పలు పాటలు కూడా పాడాడు. ఇంటిగుట్టు,పడమటి సంధ్యారాగం, గుప్పెడంత మనసు సీరియల్స్ లో నటిస్తున్నాడు.