టాప్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటోని గుర్తు పట్టారా…వెంటనే చూడండి
Uppena Heroine krithi shetty :పదహారేళ్ళ వయసులో సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టడం అంటే అంత ఈజీ కాదని కృతి శెట్టి అలియాస్ బేబమ్మ నిరూపించింది. కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటే దూసుకెళ్లవచ్చని చాటింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన తొలిసారి దర్శకత్వం వహించిన “ఉప్పెన” చిత్రంలో హీరోయిన్ గా ముంబై యంగ్ హీరోయిన్ కృతి శెట్టి నటించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు.
ప్రస్తుతం కృతి శెట్టి తెలుగులో సినిమా ఛాన్స్ లు బాగా అందిపుచ్చుకుంటోంది. ఇందులో భాగంగా నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేయడమే కాకుండా మరో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. అయితే కృతి శెట్టి సినిమాల్లో నటించడానికి ముందే పలు వాణిజ్య సంస్థల ఉత్పత్తుల ప్రకటనలలో నటించింది. ఇందులో ముఖ్యంగా శ్రీలంక దేశంలోని లైఫ్ బాయ్ సబ్బు ప్రకటనల్లో నటించింది.
కాగా ప్రస్తుతం ఈ లైఫ్ బాయ్ ప్రకటన యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతోంది. అంతేకాక ఈ అమ్మడి గురించి టాలీవుడ్ నెటిజన్లు కూడా సోషల్ మీడియా లో సెర్చి చేస్తున్నారు. పైగా కృతి శెట్టి చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తెగ ట్రెండింగ్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఇంస్టా గ్రామ్ ఖాతాను దాదాపు 4.50 లక్షల మందికి పైనే ఫాలో అవుతున్నారంటే సోషల్ మీడియాలో ఈమె రేంజ్ ఎలా ఉంటూ ఊహించవచ్చు.