ఈ సీరియల్ నటిని గుర్తు పట్టారా…సినిమాల్లో ఎంత బిజీనో…!?
Telugu actress preethi asrani :దాదాపు అన్ని ఛానల్స్ లో సీరియల్స్ కి మంచి గిరాకీ ఉంది. ఒక దాన్ని మించి మరొకటి టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఇక జీ తెలుగు లో అప్పట్లో ప్రసారమయిన “పక్కింటి అమ్మాయి” ధారావాహిక సీరియల్ ద్వారా బుల్లితెరకి నటిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోయిన్ ప్రీతీ అస్త్రాని ఆ మధ్య అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్ హీరోగా నటించిన మళ్ళీ రావా చిత్రంలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించింది.
అలాగే తెలుగులో నూతన దర్శకుడు “సుశీల్ కారంపూడి” దర్శకత్వం వహించిన ప్రెషర్ కుక్కర్ అనే మూవీలో కూడా ప్రీతీ అస్త్రాని హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా ఈ అమ్మడి నటనకు మాత్రం సినీ విమర్శ కుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. దీంతో అప్పటి నుంచి ప్రీతీ అస్త్రాని నటన పరంగా మరిన్ని మెళకువలు నేర్చుకుంటూ దూసుకు వెళ్లడం వలన వరుస సినిమా ఛాన్స్ లు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ప్రముఖ దర్శకుడు ‘సంపత్ నంది’ దర్శకత్వం వహిస్తున్న ‘సీటీమార్’ మూవీలో నటిస్తోంది.
అయితే ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తరహాలో ఉండడంతో ప్రీతీ అస్త్రాని కబడ్డీ జట్టు కెప్టెన్ గా చేస్తోందని అంటున్నారు. అలాగే నూతన హీరో నితిన్ ప్రసన్న హీరోగా థ్రిల్లర్ తరహాలో తీస్తున్న ‘ఏ'(యాడ్ ఇన్ఫిటం) అనే మూవీలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. ఇటీవల ఈ మూవీ టీజర్ విడుదలై మంచి స్పందన రాబట్టుకుంది. అంతేకాదు, పలు ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కూడా అడపా దడపా పాల్గొంటూ అందమైన ఫోటోలకు ఫోజులు ఇస్తోంది. ఈ ఫోటోలను అధికారిక ఇంస్టాగ్రామ్ తద్వారా షేర్ చేయడంతో ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు.