MoviesTollywood news in telugu

సుమ క్యాష్ గేమ్ షో వెనక రహస్యాలు…ప్రైజ్ మనీ నిజంగా ఇస్తారా…!?

Suma Cash Show :ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాం కి స్టార్ యాంకర్ సుమ యాంకర్ గా వ్యవహరిస్తూ .. సెలబ్రిటీలను , యాంకర్స్ ని ఈ ప్రోగ్రాం కి ఆహ్వానిస్తోంది. అయితే లక్షలు, కోటి వరకూ కూడా గెల్చుకుంటారని వినిపిస్తున్నా అసలు ఈ మొత్తం అంతా పార్టిసిపెంట్స్ కి ఇస్తారా లేదా అనే విషయంలోకి వెళ్తే… ఢీ లాంటి షోస్ లో ప్రయిజ్ మనీ ఇస్తారు. టాక్స్ కింద 40 శాతం కింద కట్ చేసి మిగిలిన సొమ్ము ఇస్తారు.

అలాగే స్టార్ మహిళ వంటి ప్రోగ్రామ్స్ కి జనంలోంచే సెలెక్ట్ చేస్తారు. అందం, అభినయం కూడా ఉండాలి. ప్రత్యేకంగా ఎలాంటి బహుమతి ఇవ్వరు కానీ, వీళ్ళు గెలుచుకునే బహుమతులు మాత్రం వీళ్ళకే ఇస్తారు. ఇక ఈ షోలో కనిపించే వాళ్లంతా జూనియర్ ఆర్టిస్టులే. వాళ్లకి రోజుకి 500నుంచి 700ఇస్తారట. రోజుకి మూడు ఎపిసోడ్స్ షూట్ చేస్తారు. ఈమధ్య జూనియర్ ఆర్టిస్టులు బదులు కాలేజీ స్టూడెంట్స్ ని తీసుకొస్తున్నారట. వాళ్ళకి ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వక్కర్లేదు. భోజనాలు ఎరేంజ్ చేస్తారు. ఇలా ఖర్చు తగ్గి, రేటింగ్ కూడా పెరుగుతుంది.

అయితే క్యాష్ ప్రోగ్రాం లో మాత్రం కేవలం గేమ్ మాత్రమేనని చేతికి ఇవ్వరని అంటున్నారు. ఇది గేమ్ షో కనుక పార్టిసిపెంట్స్ కి 5నుంచి 15వేలు వారి స్థాయిని బట్టి ఇస్తారు. గెలిచిన సొమ్ము కేవలం గేమ్ కిందే లెక్క. అందుకే ఏమీ ఇవ్వరట. ప్రశ్నలు ,సమాధానాలు ఇవన్నీ వినోదం జోడించి స్క్రిప్ట్ ప్రకారం ఉంటాయట. సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి గేమ్ షోస్ కి సెలబ్రిటీలు వస్తారు. అందుకే ఎలాంటి రెమ్యునరేషన్ ఉండదు. ఇక షో చివరలో పకడో పకడో రౌండ్ లో పడిపోయే, పగిలిపోయే సామాన్లు ఒరిజనల్ కాదు, అన్నీ సెట్టింగ్. అన్నీ కలిపి 10వేల వేల విలువ మించి ఉండదట.