నరాల బలహీనత,ఎముకల బలహీనత,నరాల్లో నొప్పి,కళ్ళు తిరగటం జీవితంలో ఉండవు
Nerve weakness :మన శరీరంలో నరాలు చాలా ముఖ్యమైనవి. రక్తాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకువెళ్ళటానికి సహాయ పడతాయి. ఇవి బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి ఈ నరాలు బలహీనంగా మారుతూ ఉంటాయి. ఇలా నరాలు బలహీనంగా మారినప్పుడు అనేక రకాల శారీరక సమస్యలు వస్తాయి. .
నరాల్లో అడ్డంకులు ఉన్నా, నొప్పి ఉన్నా బలహీనం అవుతాయి. నరాల బలహీనత ఉన్నప్పుడు నరాలలో అడ్డంకులు ఉన్నప్పుడు ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ కారణంగా నరాలు బలహీనపడతాయి. అధిక రక్తపోటు, నరాల లోపల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా నరాలు బలహీనపడతాయి.
కొన్నిసార్లు హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా నరాలు బలహీనం అవుతూ ఉంటాయి. అధిక మద్యపానం, అధిక ధూమపానం వల్ల కూడా నరాలు బలహీనపడతాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా నరాలు బలహీనపడతాయి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి ఒకటి నల్ల యాలకులు, అంగుళం దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి.
దాల్చిన చెక్క పొడి కూడా వాడవచ్చు. బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి.దీనిలో బెల్లం కూడా కలుపుకుని తాగవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు బెల్లం లేకుండా తాగితే మంచిది. ఒకవేళ బెల్లం వాడితే ఆర్గానిక్ బెల్లం వాడాలి. ఈ పానీయం రాత్రి సమయంలో తాగాలి. పదిహేను రోజులపాటు తాగి ఒక వారం గ్యాప్ ఇచ్చి మరల 15 రోజుల పాటు తాగాలి అలా తాగితే మీకు సమస్య తగ్గిపోతుంది.
ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ సలహాను పాటిస్తూ ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా మంచి ప్రయోజనం చాలా తొందరగా కనపడుతుంది. నరాలకు సంబందించిన సమస్యలు వచ్చినప్పుడు అసలు అశ్రద్ద చేయకూడదు. ఈ డ్రింక్ లో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ సులభంగానే అందుబాటులో ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.