కార్తీక దీపం వంటలక్క కీలక నిర్ణయం… అమెరికా వెళ్లనున్నదా
Karthika Deepam SERIAL :తెలుగు బుల్లితెరపై టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ ని ఏ సీరియల్ బ్రేక్ చేయలేకపోతోంది సోమవారం నుంచి శనివారం వరకు 7:30 అయింది అంటే దాదాపుగా ప్రతి ఇంటిలోనూ కార్తీకదీపం వెలగాల్సిందే. కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీప తన మీద పడ్డ నిందను చేరుపుకొనెందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలకు మౌనిక అడ్డం పడుతూ ఉంటుంది
దాంతో సీరియల్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. కార్తీక్ ఎవరి మాట నమ్మను అని గట్టిగా చెప్పటంతో దీప లో ఉన్న ఆశ నీరు కారిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తన మీద పడ్డ నిందను నిరూపించుకోవాలి అంటే ఒకే ఒక మార్గం తులసి. తులసి అమెరికాలో ఉన్న విహారి దగ్గరకు వెళ్లి పోతుంది. తులసి కోసం దీప అమెరికా వెళుతుందన్న టాక్ వినపడుతోంది.
కార్తీకదీపం మాతృక సీరియల్ కారుతి ముట్టులో దీప పాత్ర అమెరికా వెళుతుంది ఇప్పుడు అలాగే తెలుగులో కూడా దీప అమెరికా వెళుతుందా… పిల్లలు ఉండటంతో దీప అక్కడకు వెళ్లే అవకాశం లేదని కొంతమంది అంటున్నారు మరికొంతమంది దీప పరిస్థితిని తెలుసుకున్న తులసి,విహారి అమెరికా నుండి వస్తారు అని అభిప్రాయపడుతున్నారు మరి ఏమి జరుగుతుందో వేచి చూడాలి