MoviesTollywood news in telugu

సునయన సినిమాల్లో నటించకపోవటానికి కారణం ఇదేనట…!?

Telugu actress Sunaina :ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వాళ్లు కొంతమంది హీరోలుగా హీరోయిన్స్ గా సక్సెస్ అవుతున్నా, చాలామంది సక్సెస్ అవ్వలేదు. దేనికైనా టాలెంట్ తో పాటు అదృష్టం ఉండాలి. కొందరు హీరోలుగా సక్సెస్ అయితే కొందరు కామెడీయన్ గా ఇంకొందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నెట్టుకొస్తున్నారు. అయితే బేబీ సునయన రెండున్నర సంవత్సరాల వయసులో ‘మనసు మమత’ అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి, ఆతర్వాత కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన అమ్మోరు సినిమా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సౌందర్యని ఇంట్లో వాళ్ళందరూ చిత్ర హింసలకు గురిచేస్తుంటే, కాపాడే దేవతగా వచ్చే క్యారెక్టర్లో ఆమె చేసిన నటన ఇప్పటికీ అందరి కళ్ళముందు మెదులుతుంది.

ఇక సునయన ఓ బేబీ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కూతురుగా నటించి మంచి పేరు కొట్టేసింది. దాంతో ప్రస్తుతం ఆమెకి సినిమాల్లో మంచి ఛాన్స్ లు వస్తున్నా, సినిమాలు చేయడానికి ఇష్టపడడం లేదు. అందుకే షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో చేస్తూ ఎప్పుడు బిజీగా ఉంటోంది. ఆమె అంతకుముందు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా,ఆర్ జె గా, రైటర్ గా కూడా వర్క్ చేసింది. అయితే ఈమెకు మెగాస్టార్ చిరంజీవి సరసన నటించాలన్న కోరిక ఉందట. ఇది ఇప్పటి మాట కాదు. ఆమెకి ఐదేళ్ల వయసున్నప్పుడు చిరంజీవి సినిమా ఆడుతున్న ఒక థియేటర్ కి చిరంజీవి వస్తే, సునయన అభ్యర్ధన మేరకు వాళ్ళ అన్నయ్య చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లాడు. మీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తానని చెప్పిందట దాంతో చిరంజీవి నవ్వుకుంటూ ఆమెని ఎత్తుకున్నారట.

అయితే చిరంజీవి రాజకీయాల్లోంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ తన కోసమే ఇచ్చారని, వీలైతే చిరు పక్కన ఒక చిన్న క్యారెక్టర్ లో నటించాలని ఉందని సునయన అంటోంది. నిజానికి చైల్డ్ ఆర్టిస్టులు చేసిన వాళ్లంతా సినిమాల్లో సక్సెస్ అవ్వలేదు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా తో పాపులర్ అయిన అక్కచెల్లెళ్ళు లు షాలిని, బేబీ షామిలీ , చైల్డ్ ఆర్టిస్ట్ బాలాదిత్య, ఇంద్ర చైల్డ్ ఆర్టిస్ట్ తేజ, ఇలా చాలామంది హీరో , హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి, సక్సెస్ అందుకోలేకపోయారు. అందుకే సునయన తన లెవెల్లో తాను షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో చేస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది. ఇంతకీ చిరుతో నటించాలన్న కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.