ఉప్పెన హీరోయిన్ కొత్త ప్రయోగానికి సన్నద్ధం…స్టార్ హోదా కోసం తప్పదు
Telugu actress Krithi Shetty :హీరో,హీరోయిన్స్ గా నిలదొక్కుకోవాలంటే ఎలాంటి పాత్ర చేయడానికైనా అందుకనుగుణంగా మాడ్యులేషన్, ఆహార్యం మార్చుకోవాలి. ఫిదా సినిమాతో తెలంగాణా యాసతో ఫిదా చేసిన సాయిపల్లవి డిఫరెంట్ మూవీస్ చేస్తూ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చేసుకుంది. ఇప్పుడు లాక్ డౌన్ తర్వాత బంపర్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఉప్పెన సినిమా ఇంకా ఆడియన్స్ ఆదరణతో ముందుకు సాగుతోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సానా తొలిచిత్రమైనా, హీరో వైష్ణవ తేజ్ కి , హీరోయిన్ కృతి శెట్టికి కూడా ఇదే తొలిసినిమా.
బ్లాక్ బస్టర్ అందుకుని మొదటి సినిమాతోనే కృతి శెట్టి. అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు, ఈ బ్యూటీ మొదటి సినిమా పూర్తి కాకుండానే ఏకంగా మూడు సినిమాలలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. నానితో శ్యామ్ సింగరాయ్, సుదీర్ బాబు, అలాగే హీరో రామ్ తో కూడా నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడుఉప్పెన సినిమా ప్రమోషనల్ టూర్ లో బిజీగా ఉంది. ఇక అష్టాచెమ్మా లాంటి సినిమాలు తీసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుదీర్ బాబు ప్రేమకథా చిత్రం చేస్తున్నాడు. సుదీర్ బాబుని బుట్టలో పడేసే అమ్మాయి పాత్రలో కృతి నటించబోతోంది.
ఈ సినిమాకి ‘ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. మనం ప్రేమించే అమ్మాయి గురించి మొదటి సారి ఎవరికైనా చెప్పాల్సి వస్తే, ఎలా స్టార్ట్ చేస్తాం అనే ఎలిమెంట్ తో ఈ కథాంశం ఉంటుంది. ఇక ఈ సినిమా కోసం కృతి శెట్టి తెలంగాణ పిల్ల అవతారం ఎత్తబోతున్నట్లు తెలుస్తుంది.ప్రత్యేకంగా తెలంగాణ యాసలో ఆమె మాట్లాడుతుందని ఇందుకోసం సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ఇప్పటి నుంచే తెలుగు ప్రాక్టీస్ చేస్తుందని టాక్. స్టార్ హీరోయిన్ గా నిలబడాలంటే ఇలాగే అల్లుకు పోవాలని అందరూ అంటున్నారు.