శర్వానంద్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా ?
Tollywood Hero Sharwanand :టాలీవుడ్ లో మిడిల్ రేంజ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ పుట్టినరోజు ఈరోజు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఇష్టం ఉండటంతో ఇంటర్ పూర్తికాగానే సినిమాల్లోకి వెళతానని ఇంటిలో చెబితే తల్లి డిగ్రీ పూర్తిచేసి సినిమాల్లోకి వెళ్ళమని చెప్పింది. రానా, రామ్ చరణ్ శర్వానంద్ కలిసి చదువుకున్నారు. ముంబైలో ఒక యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుని వచ్చాక ఎన్ని ప్రయత్నాలు చేసిన అవకాశాలు రాలేదు.
కొంతమంది ఇచ్చిన సలహా మేరకు వైజాగ్ లోని సత్యానంద యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యాడు అక్కడ చేరిన తర్వాత ఐదో తారీకు సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశాడు. గమ్యం ప్రస్థానం వంటి సినిమాలు మంచి పేరును గుర్తింపును తెచ్చాయి. రన్ రాజా రన్ ఎక్స్ప్రెస్ రాజా, శతమానంభవతి వంటి సినిమాలు మంచి హిట్ అందించాయి. గత కొంత కాలంగా వస్తున్న సినిమాలు నిరాశపరిచాయి ఈనెల 11న శ్రీకారం సినిమా తో అభిమానుల ముందుకు రానున్నాడు.