MoviesTollywood news in telugu

ఉప్పెన హీరోయిన్ చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా?

Telugu actress krithi shetty : అదృష్టవంతులను ఎవరూ ఆపలేరు, దురదృష్టవంతులను ఎంత ఎంకరేజ్ చేసినా ఎదగలేరు. ఇది అక్షర సత్యమని ఉప్పెన మూవీతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కృతి శెట్టి మరోసారి నిరూపించింది. ఆమె తొలిసినిమాతోనే దుమ్మురేపింది. ఆఫర్ల మీద ఆఫర్లే కాదు రెమ్యునరేషన్ కూడా ఈ అమ్మడికి ఎక్కువే ఇస్తున్నారట. తొలి సినిమా ఉప్పెన కోసం రూ. 6 లక్షల రెమ్యునరేషన్ అందుకోగా, ఇపుడు ఏకంగా రూ. 60 లక్షల రేంజ్‌కు చేరిందంటే అర్ధం చేసుకోవచ్చు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ నటనతో అదరగొట్టింది. అందుకే వరుస ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి.

ఉప్పెన సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన “నీ కన్ను నీలి సముద్రం..” అనే సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ఏ రేంజ్ కి చేరిందో తెల్సిందే. ఆ పాట యు ట్యూబ్ లో బాగా పాపులర్ అయ్యింది. ఆ పాటలో మెయిన్ అట్రాక్షన్ హీరోయిన్ కృతి శెట్టి కావడంతో అంతలా కుర్రకారు మనసు దోచింది. నిజానికి ఈ సినిమా రిలీజ్ కి ముందే ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా నాచురల్ స్టార్ నాని సరసన ’శ్యామ్ సింగరాయ్’ లో ఓ హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకోవడంతో పాటు ఎన్టీఆర్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌, రామ్ పోతినేని మూవీస్ లో ఛాన్స్ దక్కించుకుందని అంటున్నారు.

లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తీస్తున్న మూవీలో ఛాన్స్ దక్కినట్లు అధికారిక ప్రకటన కూడిన పోస్టర్‌ను విడుదల చేసారు. అంతేకాదు, ఈ సినిమాలో నటించడానికి ఏకంగా రూ. 60 లక్షల రెమ్యునరేషన్ ను ఆఫర్ చేశారట. సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాలో కూడా ఈ భామ హీరోయిన్ గా సెలక్ట్ అయిందట. నిజానికి చాలామంది కొత్త హీరోయిన్‌లు తెలుగులో ఎంట్రీ ఇవ్వడం సహజమే. ముంబై భామల మొదలు కోలీవుడ్, శాండిల్ వుడ్ ,మలయాళం ఇలా అన్ని భాషల నుంచి ఏటా చాలామంది హీరోయిన్స్ వస్తున్నా, కొందరు మాత్రమే ఆడియన్స్ దృష్టిలో బాగా కనెక్ట్ అవుతారు. అందులో కన్నడ భామ కృతి శెట్టి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.