కృష్ణ తులసి సీరియల్ హీరో అఖిల్ రియల్ లైఫ్…అసలు నమ్మలేరు
krishna tulasi serial telugu :ఛానల్స్ లో సీరియల్స్ కొదవలేదు. ఆదరణ పెరుగుతూనే ఉంది. తాజాగా జి తెలుగులోస్టార్ట్ అయిన కృష్ణ తులసి సీరియల్ ఆడియన్స్ ఆదరణ చూరగొంటోంది. ఇందులో నటీనటులు తమ తనతో ఆకట్టుకుంటున్నారు. ఇక హీరోగా నటిస్తున్న అఖిల్ మంచి పర్సనాల్టీతో , అందంతో ,అభినయంతో ఆకట్టుకుంటున్నాడు. తన పాత్రకు తగ్గట్టు నటిస్తూ తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపు పొందాడు.
అఖిల్ కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో అక్టోబర్ 16న జన్మించాడు. అసలు పేరు దిలీప్ ఆర్ శెట్టి. మాస్టర్ ఆఫ్ కామర్స్ పూర్తిచేసిన దిలీప్ ఓ కంపెనీలో ఎక్కౌంటెంట్ గా చేసాడు. ఇక చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉంది. దాంతో మోడల్ గా తన కెరీర్ స్టార్ట్ చేసాడు. 2015లో మిస్టర్ దుబాయ్ పోటీల్లో పాల్గొని ఫైనల్ రౌండ్ లో ఫస్ట్ రన్నరప్ గా నిలిచాడు.
కన్నడలో పలు డాన్స్ షోలతో ఆడియన్స్ ని అలరించాడు. విధి వినాయక అనే కన్నడ సీరియల్ లో నటించే ఛాన్స్ రావడంతో అందులో చేసాడు. త్వరలో రిలీజ్ కాబోయే రోబోట్ అనే కన్నడ మూవీలో కూడా నటించాడు. ప్రేమ ఎంత మధురం హీరోయిన్ వర్షతో కల్సి కస్తూరి నివాస్ సీరియల్ లో నటించే ఛాన్స్ కొట్టేసాడు. వీటితో మంచి పాపులర్టీ వచ్చింది. స్వర్ణ ఖడ్గం సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు.