MoviesTollywood news in telugu

డ్రైవర్ బాబు సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?

Driver babu Full Movie :డిగ్రీ కూడా పూర్తిచేయకుండా సినిమాలపై ఇంట్రస్ట్ తో ఏలూరులో పంపిణీ సంస్థను భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్ అలియాస్ ప్రసాద్ తన మిత్రులతో కల్సి ఏర్పాటుచేశారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన దొంగలకు దొంగ మూవీని పంపిణీ చేసారు. లాభం బాగానే వచ్చింది. తర్వాత చిన్నా చితకా సినిమాలు పంపిణీ చేసినా లాభాలు పెద్దగా రాలేదు. ఇక సినిమా తీయాలని మద్రాసు వెళ్లారు.

ఫిలిం జర్నలిస్ట్ మోహన్ కుమార్ ద్వారా కృష్ణను కలవడంతో కృష్ణ డేట్స్ ఇచ్చారు. డైరెక్టర్ బాపయ్య కూడా ఒకే చెప్పారు. కథ కోసం కసరత్తు స్టార్ట్ చేసారు. ఎన్నో కథలు అనుకున్నా ఏదీ కుదరలేదు. ఈలోగా కృష్ణ బిజీ అయిపోయారు. రెండో సినిమా చేస్తానని, ఈలోగా తొలిసినిమా ఇంకొకరితో తీసుకోమని చెప్పడంతో నటభూషణ్ శోభన్ బాబు దగ్గరకు వెళ్లారు. శోభన్ ఒకే చెప్పారు. ఈలోగా బాపయ్యకు హిందీ సినిమా ఛాన్స్ రావడంతో అటు వెళ్లిపోయారు. డైరెక్ట్ చేయడానికి ఎవరూ రాలేదు.

దాంతో అప్పట్లో అమితాబ్ నటించిన ఖుదాదార్ సినిమా హిట్ అవ్వడంతో శోభన్ బాబు సూచనమేరకు రీమేక్ హక్కులను ప్రసాద్ దక్కించు కున్నారు. 1985 సెప్టెంబర్ లో మద్రాసు అరుణాచలం స్టూడియోలో బోయిన సుబ్బారావు డైరెక్టర్ గా డ్రైవర్ బాబు షూటింగ్ ని ప్రసాద్ స్టార్ట్ చేసారు. రాధ హీరోయిన్. సత్యనారాయణ, శోభన్ బాబు , రాజేష్ అన్నదమ్ములుగా నటించారు. సిస్టర్ గా రాజ్యలక్ష్మి నటించింది. మరోవైపు రజనీకాంత్ హీరోగా పదికాదన్ మూవీ ఇదే కథతో స్టార్ట్ చేసారు. అందులో రాధ అక్క అంబికా హీరోయిన్. అయితే తమిళంలో ముందుగా రిలీజై హిట్ కొట్టింది. తెలుగులో అంతగా ఆడలేదు. ఇక ప్రసాద్ రెండవ మూవీ మావూరి మగాడు ని కృష్ణ, శ్రీదేవి జంటగా తీశారు