కోలీవుడ్ లో స్టార్ హీరోల వారసుల పరిస్థితి ఎలా ఉందో…?
Kollywood Heroes Sons :రాజకీయాల్లో, సినిమాల్లో వారసత్వం అనేది సాధారణంగా మారింది. అయితే టాలెంట్ ఉంటేనే రాణిస్తున్నారు. ఎంత పెద్ద హీరో కొడుకైనా టాలెంట్ లేకుంటే రాణించలేడు. ప్రస్తుతం టాలీవుడ్ లో బయటి నుంచి వచ్చిన కుర్ర హీరోలు చకచకా ఎదిగిపోతుంటే, అక్కినేని అఖిల్ వంటి వారసులు సరైన క్రేజ్ మరియు బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్ లోని కొంతమంది వారసులలో సైతం ఇదే ధోరణి కనిపిస్తోంది. తమిళనాట రెబల్ స్టార్ ఇమేజ్ తో ఒకప్పుడు సత్యరాజ్ ఓ ఊపు ఊపేసాడు. అప్పట్లో హీరోగా కొన్ని డబ్బింగ్ తో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు.
సత్యరాజ్ ఇప్పటికీ క్యారెక్టర్ యాక్టర్ గా సత్తా చాటుతూ బాహుబలి, మిర్చి వంటి సినిమాల్లో అదరగొట్టాడు. అయితే ఆయన తనయుడు ‘శిబిరాజ్’ కోలీవుడ్ తెరకి పరిచయమై చాలాకాలమే అయినా ఇంతవరకూ ప్రత్యేక గుర్తింపు లేదు. ఇక శివాజీ గణేశన్ మనవడిగా .. ప్రభు తనయుడిగా పరిచయమైన విక్రమ్ ప్రభు పరిస్థితి కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఇక తెలుగులో ‘అభినందన’ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న కార్తీక్ తమిళంలో ఒక రేంజ్ లో దూసుకుపోయాడు.
మణిరత్నం సినిమాతో పరిచయమైన ఆయన కొడుకు గౌతమ్ కి స్టార్ ఇమేజ్ రాలేదు. అలాగే హీరో విక్రమ్ తనయుడు ‘ధృవ్’ కూడా అర్జున్ రెడ్డి రీమేక్ తో ఎంట్రీ ఇచ్చినా ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేదు. ‘హృదయం’ పేరుతో విడుదలై టాలీవుడ్ లో యూత్ ను ఒక ఊపు ఊపేసిన హీరో మురళి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన అధర్వ మురళికి ఛాన్స్ లు బాగానే వస్తున్నా, ఇంకా గాడిన పడలేదు. గద్దలకొండ గణేశ్ ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ కి కూడా యితడు పరిచయమయ్యాడు