MoviesTollywood news in telugu

టిక్ టాక్ దుర్గారావు ఒక ఇంటర్వ్యూకు ఎంత తీసుకుంటాడో తెలుసా?

Tik Tok Durga Rao Remuneration :ప్రతి దానివలన లాభం ఎంతుంటుందో నష్టం కూడా అదే రేంజ్ లో ఉంటుంది. కొందరికి కల్సి వస్తే, మరికొందరికి రివర్స్ అవుంతుంది. ఇక చైనా యాప్ టిక్ టాక్ వల్ల లాభం ఎంత జరిగిందో నష్టం కూడా అంతే జరిగింది. చైనాతో యుద్ధ వాతావరణం నేపథ్యంలో చాలా యాప్ లను భారత ప్రభుత్వం నిషేధించగా, అందులో టిక్ టాక్ కూడా ఉంది. అయితే అప్పటికే టిక్ టాక్ ద్వారా కొందరు పాపులర్ అయ్యారు. టిక్ టాక్ రాక ముందు మనకున్న టాలెంట్ తెలియాలంటే మనకు ఓ వేదిక కావాలి.

ఇందుకు ఎవరో ఒకరు ఛాన్స్ ఇవ్వాల్సి వచ్చేది. కొందరికి ఎంత ప్రయత్నించినా ఛాన్స్ వస్తుందో రాదో తెలియని దుస్థితి ఉండేది. సరిగ్గా అదే సమయంలో టిక్ టాక్ యాప్ ద్వారా మన టాలెంట్ మనం చూపించే ఛాన్స్ ఉండడంతో ఎక్కువ మంది టిక్ టాక్ వైపు మొగ్గుచూపించారు. కొన్ని వెర్రి మొర్రి వేషాలతో, వెకిలి చేష్టలతో విసుగు తెప్పించేలా ఉన్నా, కొన్ని మాత్రం నిజంగా వాళ్ళల్లో టాలెంట్ బయట పడేది.

ఇలా టిక్ టాక్ ద్వారా పాపులర్ అయిన వారిలో దుర్గారావు టిక్ టాక్ బ్యాన్ తరువాత కూడా తన సత్తాను చాటడంతో పలు సినిమాలలో ఛాన్స్ లు దక్కించుకున్నారు. అంతేకాదు, యూ ట్యూబ్ ఛానల్స్ ద్వారా నెలకు 50 వేల రూపాయలకు పైగా సంపాదిస్తున్న దుర్గారావు ఆర్థిక కష్టాల నుండి బయట పడ్డాడని అంటున్నారు. అయితే టిక్ టాక్ దుర్గారావు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తే 15వేల రూపాయలు తీసుకుంటున్నాడని ఓ వార్త వైరల్ గా మారింది.