ఇంటికి దీపం ఇల్లాలు హీరోయిన్ కృష్ణప్రియ రియల్ లైఫ్….అసలు నమ్మలేరు
Intiki deepam illalu serial heroine krishna priya :బుల్లితెర ఆడియన్స్ ని సీరియల్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ ఛానల్ లో ఇటీవల మొదలై తక్కువ సమయంలోనే బాగా ఆకట్టుకుంటున్న ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ లో నటీనటులు తమ నటనతో అలరిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ గా నటిస్తున్న కృష్ణప్రియ మొదటి సీరియల్ తోనే తన అందంతో , అభినయంతో తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో అలరిస్తోంది.
కృష్ణప్రియ అసలుపేరు దానియా దీపిక. 1991 జూన్ 27న కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జన్మించింది. ఆమె తండ్రి ఓ మ్యుజీషయన్. అత్త ఓ డాన్సర్. దాంతో చిన్నతనం నుంచే కృష్ణప్రియ కు డాన్స్, మ్యూజిక్ మీద మక్కువ పెంచుకుంది. అత్తదగ్గర భరత నాట్యంలో శిక్షణ తీసుకుంది. పలు డాన్స్ ప్రోగ్రామ్స్ లో స్కూల్ డేస్ లోనే పాల్గొంది. అలాగే స్టేజి ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చింది. గ్రాడుయేషన్ పూర్తయ్యాక ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేసింది.
అదే సమయంలో ఫ్రెండ్స్ సలహాతో సీరియల్ ఆడిషన్స్ కి వెళ్ళింది. అలా కన్నడ సీరియల్ లో నటించే ఛాన్స్ తెచ్చుకుంది. ఆ సీరియల్ బాగా పాపులర్ కావడంతో కృష్ణ ప్రియకు మంచి గుర్తింపు లభించింది. కన్నడ సీరియల్స్ తో పాటు రెండు మూడు కన్నడ సినిమాల్లో సైతం నటించింది. కన్నడ షార్ట్ ఫిలిమ్స్ లో కూడా చేసింది. 2019లో మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిల్ గెలుచుకుంది. తెలుగు , కన్నడ సీరియల్స్ లో నటించిన ఆకర్ష్ ని పెళ్లాడిన ఈమె తెలుగు, కన్నడ సీరియల్స్ లో దూసుకెళ్తోంది.