MoviesTollywood news in telugu

మోహన్ బాబుకి పేరు తెచ్చిన సినిమాలు…ఏమిటో చూడండి

Mohan Babu Top Movies :టాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోలుగా ఎదిగిన వాళ్ళల్లో డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఒకరు. ఎన్నో హాస్య భరిత సినిమాలు, యాక్షన్, సెంటిమెంట్ లతో కూడిన సినిమాలలో నటించి, డైలాగులతో అదరగొట్టడమే కాకుండా , కలెక్షన్స్ లో కూడా కింగ్ అనిపించుకున్నారు. మంచు మోహన్ బాబు ని హీరోగా నిలబెట్టిన సినిమాల విషయానికి వస్తే, 1982లో బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన అసెంబ్లీ రౌడీ ప్రధానమైనది. ఇందులో మోహన్ బాబు తో హీరోయిన్ దివ్యభారతి జోడీ కట్టగా, ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేసిన పెదరాయుడు సినిమాలో ద్వి పాత్రాభినయం చేసిన నటించిన మోహన్ బాబు సరసన భానుప్రియ, సౌందర్య నటించారు. ఆయన స్నేహితుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటించి మెప్పించారు.

అలాగే 1991లో రౌడీ గారి పెళ్ళాం సినిమాలో మోహన్ బాబు తన నటనతో హీరోగా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన అల్లుడుగారు సినిమాలో హీరోగా నటించగా ఇందులో శోభన హీరోయిన్ గా చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. 1998లో విడుదలయిన శ్రీరాములయ్య సినిమాలో మోహన్ బాబు సరసన సౌందర్య హీరోయిన్ గా నటించగా సూపర్ హిట్ అయింది. అలాగే రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లరి మొగుడు రూపొందింది.

ఇందులో మోహన్ బాబు సరసన మీనా,రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఎన్టీఆర్ కీలక పాత్రలో దర్శకేంద్రుని దర్శకత్వంలో వచ్చిన మేజర్ చంద్రకాంత్ మూవీ లో మోహన్ బాబు సరసన టబు, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా చేసారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అలాగే బప్పీలహరి మ్యూజిక్ తో వచ్చిన బ్రహ్మ సినిమాలో కూడా మోహన్ బాబుకి మంచి పేరొచ్చింది. ఇక బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన అడవిలో అన్న సినిమా కూడా గుర్తింపు తెచ్చింది. అంతేకాదు, రాయలసీమ రామన్న చౌదరి, పోస్ట్ మాన్,యమ ధర్మరాజు ఎం ఏ వంటి సినిమాలలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.