సంపూర్ణేష్ స్టైల్ వేరు…లైఫ్ స్టైల్ తెలిస్తే షాక్ అవ్వాలసిందే
Sampoornesh babu Movies :ఒక్కొక్క హీరోకి ఒక్కో స్టైల్. అలాగే అందగాడు కాకున్నా తనకంటూ ఓ మేనరిజం తో హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు బర్నింగ్ స్టార్ హోదా దక్కించుకున్నాడు. ఆమధ్య కొబ్బరి మట్ట మూవీలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో రాధా కృష్ణ అనే మూవీలో టక్కరి దొంగ చక్కని చుక్క అనే మూవీ లో కూడా హీరోగా చేయడానికి ఒకే చెప్పాడు. ఇక సామాజిక కార్యక్రమాల్లో సైతం పాల్గొంటూ, ఉపద్రవాలు ఏర్పడినపుడు తనవంతు సాయం కూడా అందిస్తూ విలక్షణత చాటుకుంటున్నాడు.
నూతన దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన హృదయ కాలేయం మూవీతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ సంపూర్ణేష్ బాబు కి స్టార్ డమ్ తెచ్చిపెట్టినా ఇప్పటికీ సాదాసీదాగా ఉంటాడు. ఇప్పటికీ బస్సులో ప్రయాణం చేస్తాడట. తాజాగా సంపూర్ణేష్ బాబు ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను షేర్ చేసుకున్నపుడు ఈ విషయం వెలుగు చూసింది. స్టార్ హీరో అయినప్పటికీ ఇప్పటికీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న విషయం నిజమేనా.? అని ప్రశ్నించడంతో నిజమేనని సంపూర్ణేష్ తెలిపాడు. ఇందుకు గల కారణాలను కూడా చెప్పుకొచ్చాడు.
“నేను ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన సిద్దిపేటలో ఉంటున్నా. ఎప్పుడైనా షూటింగు కోసం హైదరాబాద్ కి వచ్చి వెళుతూ ఉంటా. అలాంటప్పుడు ఒక్కోసారి తన కారు డ్రైవర్ అందుబాటులో లేకపోవడం, ఆర్థిక సమస్యల కారణంగా ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ కి ప్రయాణిస్తుంటా. దీనికి ఏమాత్రం నామోషీ ఉండదు. పైగా పదిమందితో కలిసి ప్రయాణించడం నాకు చాలా ఇష్టం. అందుకే ఒక్కోసారి కావాలనే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుంటా. కొంతమంది ప్రయాణికులు నన్ను గుర్తించి ఫోటోలు, సెల్ఫీలు కూడా తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తారు” అని సంపూర్ణేష్ వివరించాడు.