MoviesTollywood news in telugu

పుష్ప విలన్ కి భారీగా రెమ్యునరేషన్…షాక్ అవ్వాలసిందే

pushpa villain fahadh faasil remuneration :క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్‌ కాంబినేషన్ అంటేనే ఫాన్స్ కి పిచ్చ క్రేజ్. పైగా రామ్ చరణ్ తో రంగస్థలం వంటి డిఫరెంట్ మూవీ తీసి బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్ ఇప్పుడు బన్నీతో తీస్తున్న మూవీ పుష్ప పై భారీ అంచనాలున్నాయి. ముద్దుగుమ్మ రష్మిక మందన్నా హీరోయిన్ గా రూపొందుతున్న పుష్ప సినిమాలోని బన్నీ లుక్‌ రివీల్ చేసి సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేర్చేసారు.

పాన్ ఇండియా రేంజ్‌ లో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి ఇందులో విలన్ గా చేస్తున్నట్లు మొదట్లో వార్తలు వైరలయ్యాయి. అయితే షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల తప్పుకుంటున్నట్లు స్వయంగా విజయ్‌ సేతుపతి ప్రకటించడంతో కొత్త విలన్ కోసం వేట మొదలుపెట్టారు.

దానికి తోడు సినిమా షూటింగ్‌ మొదలయిన నేపథ్యంలో మలయాళ నటుడు పాహద్ ను విలన్ గా ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించడం విశేషం. మలయాళంలో క్రేజ్ గల ఫాహద్ ఫాసిల్ సెలక్ట్ చేయడంతో 10 కోట్ల అదనపు బిజినెస్ అవుతుందని అంచనా. అందుకే అతడు డిమాండ్ చేసిన భారీ మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు రెడీ అయ్యారట. ఫాహద్‌ ఫాసిల్‌ ఏకంగా 5 కోట్ల రూపాయలను పారితోషికంగా ఇస్తున్నారట. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో విలన్‌ గా ఇంత భారీఎత్తున ముట్టజెప్పడం రికార్డు అంటున్నారు.