స్టార్ హీరో కూతురుని గుర్తు పట్టారా…ఇప్పుడు హీరోయిన్…!?
Rajasekhar daughter shivatmika :సినిమా నటీనటులకు సోషల్ మీడియా ఖాతాలు ఉండడంతో యాక్టివ్ గా ఉంటూ, పలు అంశాలను షేర్ చేస్తున్నారు. పైగా చిన్నప్పటి ఫోటోలు వైరల్ చేస్తున్నారు. స్టార్ హీరో రాజశేఖర్, జీవిత లకు ఇద్దరు కూతుళ్లు ఉండగా అందులో శివాత్మిక ప్రస్తుతం తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన దొరసాని సినిమా లో హీరోయిన్ గా నటించి, తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉండే శివాత్మిక తన చిన్ననాటి ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా, ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో శివాత్మిక ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో వైట్ కలర్ డ్రెస్ లో ఎంతో క్యూట్ గా ఉంది. దాంతో పాటు మరిన్ని పిక్స్ తన ఖాతాలో షేర్ చేయగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
శివాత్మిక ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ మార్తాండ మూవీలో చేస్తోంది. అయితే చిన్నప్పటి ఫోటో క్యూట్ గా ఉండడంతో కామెంట్స్ కూడా వస్తున్నాయి. అసలు గుర్తుపట్టలేనంతగా ఉండడంతో ఎవరీ క్యూట్ బేబీ అని ఆశ్చర్యపోవడం మరికొందరి వంతైంది.