నవీన్ పోలిశెట్టి లైఫ్ స్టైల్ గురించి నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు
Naveen Polishetty net Worth :ఏజంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ మూవీతో హీరోగా 2019లో ఎంట్రీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు పేరుతొ ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. స్టార్ హీరో హోదాకు చేరువైన నవీన్ పోలిశెట్టి 1989డిసెంబర్ 27న జన్మించాడు. హైదరాబాద్ నల్లకుంటకు చెందిన ఇతడికి ప్రస్తుతం 32ఏళ్ళు. ఇప్పటికీ బాచిలరే. ఇతడికి ఒక సిస్టర్, ఒక బ్రదర్ ఉన్నారు. ఇతడిని నవీన్, బంటీ అనే నిక్ నేమ్ లతో పిలుస్తారు. నల్లకుంటలోని శ్రీ గురుదత్త హైస్కూల్ లో చదివేటప్పుడు కల్చరల్ ఈవెంట్స్ లో పాల్గొనడంతో పాటు స్కూల్ కి డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్ళేవాడు.
నవీన్ పోలిశెట్టి ఎక్కువగా అమ్మాయి క్యారెక్టర్ లు వేయడం వలన వాళ్ళ నాన్న అమ్మాయి డ్రెస్ కూడా కొనిచ్చాడు. టెన్త్ పూర్తయ్యాక ముంబయి వెళ్లి నటన మీద ట్రైనింగ్ తీసుకోవాలని అనుకుంటే స్టడీస్ పూర్తిచేయమని తండ్రి చెప్పాడు. ఆవిధంగా మధ్యప్రదేశ్ భోపాల్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తిచేసిన యితడు ఖాళీ సమయంలో మొబైల్ ముందు నటించేవాడు. ఇక ప్లేస్ మెంట్ లో లండన్ లో జాబ్ రావడంతో చేయడం ఇష్టం లేక రిజైన్ చేసి, ఇండియాకి వచ్చేసాడు.
సినిమా ఛాన్స్ ల కోసం తిరుగుతుంటే, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో ఛాన్స్ కొట్టేసాడు. 2013లో డి ఫర్ దోపిడీ మూవీలో చేసాడు. మహేష్ బాబు హీరోగా వచ్చిన వన్ నేనొక్కడినే మూవీలో చిన్న పాత్ర వేసాడు. చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఏజంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సుశాంత్ రాజపుత్ తో కల్సి హిందీ మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది. ఇక తాజాగా జాతిరత్నాలు మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. 40వేలనుంచి మొదలైన రెమ్యునరేషన్ 37లక్షలకు చేరింది. 18న్నర లక్షల విలువైన ఇన్నోవా క్రిష్టా కారు ఉంది. ఓ ఖరీదైన అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు. మహేష్ బాబు, అనిల్ కపూర్, హీరోయిన్స్ ఎమిలియా క్లార్క్, గాళ్ క్యాడెట్ అంటే ఇష్టం