తండ్రి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కూతురు…ఏమిటో తెలుసా?
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదల్లేదు. ఎందరినో తాకింది. కొందరిని కాటేసింది. ఇక సినిమా ఇండస్ట్రీని సైతం కుదిపేసింది. చాలామంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఉండే డాక్టర్ రాజశేఖర్ అతికష్టం మీద కోలుకుని బయట పడ్డారు. నిజానికి గత ఏడాది డాక్టర్ రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడ్డారు. ఇందులో భార్య జీవిత, కుమార్తెలు శివాని, శివాత్మికలు ఈజీగానే కరోనాను జయించారు. కానీ రాజశేఖర్ మాత్రం తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు.
వెంటిలేటర్ పై ఉంచి మరీ డాక్టర్ రాజశేఖర్ కి చికిత్స అందించడంతో ఆయన పరిస్థితి గురించి మీడియాలో పుకార్లు షికార్లు కూడా చేశాయి. చాలా సీరియస్ గా ఉన్నారని ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా వైధ్యులు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. దాదాపు రెండు వారాల పాటు రాజశేఖర్ తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొని గెలిచారు. ఆయన మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో అప్పటి విషయాలను ప్రస్తావిస్తూ, ఆయన పెద్ద కూతురు శివాని ఉద్వేగానికి గురైంది.
“ఓ విధంగా నాన్నకు కరోనా సోకడానికి కారణం నేనే. అమ్మా నాన్న జాగ్రత్తగా ఇంటికే పరిమితం అయ్యారు. నేను మాత్రం బయట తిరిగేదాన్ని. దాంతో కరోనా సోకింది. నా ద్వారా నాన్నకు సోకింది. ఆసుపత్రిలో నాన్న ఉన్న సమయంలో నా వల్లే నాన్నకు ఈ పరిస్థితి వచ్చిందని మానసిక క్షోభకు గురయ్యా. పైగా నాకు చిన్నతనం నుంచే గుండె సమస్య ఉంది. నాన్న ఆసుపత్రిలో ఉన్న సమయంలో గుండె సమస్య మళ్లీ తిరగబెట్టింది. ఒక వైపు నాన్న కరోనా చికిత్స చేయించుకుంటుంటే, మరో వైపు నాకు గుండె సంబంధించిన చికిత్స చేసారు. ఇప్పుడంతా సేఫ్’ అని శివాని చెప్పుకొచ్చింది.