ప్రభాస్ కారు ఖరీదు తెలిస్తే షాకవుతారు
Prabhas new car :హీరో హీరోయిన్స్ తమ రేంజ్ కి తగ్గట్టు ఇళ్లల్లో ఉంటారు. తమకు నచ్చిన విధంగా ఇంటి డిజైన్ చేసుకోవడంతో పాటు ఖరీదైన కార్లు, వస్తువులు, బాగ్ లు, వాచీలు, బైక్ లు , ఇలా ఒకటేమిటి అన్నీ కాస్ట్లీ గానే ఉంటాయి. తాజాగా బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఓ కొత్త కారు కొన్నాడట. దాని గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే కొన్ని కార్లు ఉన్నప్పటికీ కొత్తగా మరో కారు కొన్నాడని, దాని ఖరీదు 7కోట్ల రూపాయలు ఉంటుందని టాక్. నిజానికి బాహుబలికి ముందు 10కోట్లు అందుకునే ప్రభాస్ ఇప్పుడు 100కోట్ల రెమ్యునరేషన్ కి చేరిపోయాడని అంటున్నారు. అంతలా అతడి రేంజ్ మారిపోయింది.
కొత్తగా సలార్, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న ప్రభాస్ ముంబయిలో షూటింగ్స్ ఒక దాని తర్వాత ఒకటి అవుతోంది. రాధేశ్యాం పూర్తికాగా మిగిలినవి సెట్స్ మీద ఉన్నాయి. ఇక షూటింగ్స్ సమయంలో స్టే చేయడానికి సొంతంగా ఇల్లు ఉంటె మంచిదని ఇంటికోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడట.