MoviesTollywood news in telugu

ఒక్క యాడ్ కి త్రివిక్రమ్ ఎంత తీసుకుంటాడో తెలుసా ?

Trivikram remuneration :మన స్టార్ హీరోలు సినిమాల్లో నటిస్తూనే మరోపక్క యాడ్స్ లో కూడా చేస్తూ తమ సంపాదన పెంచుకుంటున్నారు. ఒక్కో యాడ్ కి భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటారని అంటారు. అయితే సినిమాలతో పాటు యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంటే, మరోపక్క ఈ యాడ్స్ కి రూపకల్పన చేస్తున్నవాళ్లలో మన స్టార్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అందులో ముఖ్యంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అగ్రస్థానంలో ఉన్నారట.

సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు పలు రకాల కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అయితే వీళ్లకు యాడ్స్ రూపకల్పనలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కీలక పాత్ర వహిస్తున్నారట. ఒక్కో యాడ్ కి 30లక్షల వరకూ త్రివిక్రమ్ అందుకుంటాడని టాక్.

మెహర్ రమేష్, వంశీ పైడిపల్లి వంటివాళ్ళు ఇప్పటికే యాడ్స్ డైరెక్ట్ చేసి, ఆడియన్స్ ని అభిమానులను మెప్పించారు. యాడ్ స్క్రిప్ట్, కాన్సెప్ట్ కంపెనీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. అయితే దాన్ని డైరెక్ట్ చేయడమే డైరెక్టర్స్ చేతుల్లో ఉంటుంది. మొదట్లో మాటల రచయిత గా తరవాత డైరెక్టర్ గా మారిన త్రివిక్రమ్ ఇప్పుడు యాడ్స్ డైరెక్ట్ కూడా చేస్తూ , బాగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.