Suma కి యాంకరింగ్ లో గురువు ఎవరో తెలుసా…?
Telugu Top Anchor Suma : యాంకర్ సుమ అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రతి రోజు Tv లో ఎదో ఒక కార్యక్రమంలో కనపడుతూ ఉంటుంది. పేరుకి మలయాళీ అమ్మాయి అయినా తెలుగులో అలవోకగా మాట్లాడేస్తూ, సమయస్ఫూర్తితో జోక్స్ కూడా మేళవించి చెణుకులు విసురుతూ యాంకరింగ్ చేయడంలో సుమ దిట్ట. అయితే మొదటి సారిగా 1991లో దూరదర్శన్ లో యాంకరింగ్ చేసిన ఈమె ఇన్నాళ్లూ టాప్ వన్ యాంకర్ గా రాణిస్తున్నారంటే, ఇందుకు బలమైన పునాది ఉంటుంది కదా. తెలుగు నేర్చుకుని ఈ స్థాయిలో టాప్ యాంకర్ గా కొనసాగడం వెనక ఈమె కృషి, పట్టుదల అర్ధం చేసుకోవచ్చు.
సినిమా ఈవెంట్ అయినా.. టీవీ షో అయినా.. తనదైన స్టైల్లో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. పలు టీవీ సీరియళ్లలో నటించిన సుమ పలు సినిమాల్లోనూ నటించారు.’కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కూడా చేసి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో మెరిసింది. ఆ తర్వాత తాను సినిమాల్లో నటించడం భర్త రాజీవ్ కు ఇష్టం లేకపోవడం వల్లే తనంతట తానే మానేశానని ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సుమ వెల్లడించింది.
దాంతో ఇక యాంకరింగ్ లో స్థిరపడిపోయానని చెప్పుకొచ్చిన సుమ ఇంతగా రాణించడానికి కారణం ఎవరో కూడా చెప్పింది. యాంకర్ గా సెన్సాఫ్ హ్యూమర్ తో ఇలా మాట్లడడానికి తన తల్లి కారణమని, చిన్నప్పుడు ఇంట్లో అమ్మ సరదాగా మాట్లాడేదని తనకు కూడా అదే అలవాటైందని, అందుకే యాంకరింగ్ లో తన తొలి గురువు అమ్మ అని సుమ వివరించింది.