కాజల్ కి ఎన్ని బిజినెస్ లు ఉన్నాయో…ఎన్ని కోట్ల అస్థి ఉందో…?
Telugu Actress Kajal :ఇటీవల ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్చు ని ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్న స్టార్ హీరోయిన్, ముంబై బ్యూటీ కాజల్ అగర్వాల్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీలో చేస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన లాహి లాహి అనే రామజోగ య్య శాస్త్రి లిరికల్ సాంగ్ రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక మంచు విష్ణు హీరోగా నటించిన మోసగాళ్లు మూవీలో హీరో అక్క పాత్రలో నటించినా, ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేదు. ఒక్కోమూవీకి దాదాపు 2 నుంచి 5 కోట్ల రూపాయల వరకూ సినిమాను బట్టి రెమ్యునరేషన్ అందుకుంటోంది.
అయితే కాజల్ అగర్వాల్ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా తన సంపాదన వేరే రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. అలాగే బంగారం, హోటళ్లు, ట్రావెలింగ్ సంబంధిత రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఏటా కోట్ల రూపాయలు లాభం ఆర్జిస్తోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణిస్తోందని టాక్. ఇప్పటికే ఆమె ఆస్తుల విలువ దాదాపుగా 730 కోట్ల రూపాయలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ ముంబై, చెన్నై, బెంగళూరు తదితర ప్రముఖ నగరాల్లో రియల్ ఎస్టేట్ సంబంధిత ఆస్తులు కూడా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.
స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా అత్యంత ధనవంతులైన నటిగా కూడా పేరుగాంచింది. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన లక్ష్మీ కళ్యాణం మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో కాజల్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, తర్వాత స్టార్ హీరోల చిత్రాల్లో నటించే ఛాన్స్ దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.