2012లో కన్నుమూసిన సెలబ్రిటీలు…ఎంత మంది ఉన్నారో…?
Telugu actor died 2012 :పుట్టినవాళ్ళు మరణించక తప్పదని ఎంత చెప్పినా కొందరు ఈలోకం నుంచి పొతే వాళ్ళ గుర్తులు మిగిలే ఉంటాయి. వాళ్ళని తలచుకుని బాధ పడుతూనే ఉండేవాళ్ళు ఉంటారు. ఇక సెలబ్రిటీలు అయితే చెప్పక్కర్లేదు. ఇక 2012లో మరణించిన సెలబ్రిటీల విషయానికి వస్తే, ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు రెండవ తనయుడు సుమన్ యాక్టర్ గా, రచయితగా, దర్శకుడిగా పలు రంగాల్లో రాణించి, ఎన్నో సీరియల్స్ తీశారు. అంతరంగాలు,అందం వంటి సీరియల్స్ విశేష ఆదరణకు నోచుకున్నాయి. సెప్టెంబర్ 7న అనారోగ్యంతో ఈయన కన్నుమూశారు
నాటకరంగం నుంచి జంధ్యాల స్పూర్తితో సినిమా రంగానికి వచ్చి సుత్తివేలుగా పేరొంది, దశాబ్ద కాలం పాటు కామెడీతో పాటు వివిధ రకాల పాత్రలకు జీవం పోశారు. సుత్తివేలు 2012సెప్టెంబర్ 16న గుండెపోటుతో కన్నుమూశారు. ఇక 1982లో భక్తద్రువ మార్కండేయ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన అశ్విని పలు భాషా చిత్రాల్లో నటించారు. కొడుకు దిద్దిన కాపురం, భార్యాభర్తల భాగోతం, గోపాలరావు గారి అబ్బాయి వంటి సినిమాల్లో నటించారు. సెప్టెంబర్ 23న లివర్ వ్యాధితో కన్నుమూశారు.
మరో నటి హేమాశ్రీ అక్టోబర్ 9న అనుమానాస్పద మృతి చెందారు. తెలుగు, కన్నడ లో నటిగా ఈమె గుర్తింపు తెచ్చుకుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీతో యశో సాగర్ 25 ఏళ్ల వయస్సులోనే కన్నుమూసి, అందరిని శోకసంద్రంలో ముంచారు. డిసెంబర్ 19న రోడ్డుప్రమాదంలో బెంగుళూరులో దుర్మరణం పాలయ్యాడు. .