MoviesTollywood news in telugu

నిఖిల్ హీరోయిన్ అవకాశాలు లేక ఏమి చేస్తుందో తెలుసా?

Telugu actress aksha pardasany :టాలీవుడ్ లో యువత,రైడ్,కందిరీగ,డిక్టేటర్,బెంగాల్ టైగర్,రాధ తదితర మూవీస్ లో ప్రాధాన్యత గల పాత్రలలో నటించిన అక్షా పార్ధసాని తెలుగుతో పాటు తమిళ,మలయాళ,కన్నడ తదితర భాషలలో కలిపి దాదాపు పదికి పైగా చిత్రాలలో హీరోయిన్ గా చేసింది.వర్ధమాన హీరో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన యువత మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వచ్చి రావడంతోనే వరుస సినిమా ఛాన్స్ లు దక్కించుకొని కొంతకాలం పాటు బానే రాణించింది.

కానీ కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఈ ప్రభావం అక్షా కెరియర్ ని దెబ్బతీసింది. ప్రస్తుతం సినిమా ఛాన్స్ లు లేక ఎక్కువ సమయం ఖాళీగా గడుపుతోంది. అయితే ఇటీవలే ఈమె కాట్మండు కనెక్షన్ అనే వెబ్ సీరీస్ లో నటించి, దాదాపు 25 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంది. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 23 నుంచి సోనీ లైవ్ యాప్ లో ప్రసారం అవుతుందని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా ఫోటోలు షేర్ చేస్తూ అక్షా వెల్లడించింది.

అక్షాకి తెలుగులో పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినప్పటికీ రానురాను గెస్ట్ అప్పియరెన్స్,సెకండ్ హీరోయిన్,కామెడీ వంటి పాత్రలలో నటించడంతో హీరోయిన్ గా ఛాన్స్ లు ఆటోమేటిక్ గా తగ్గాయి. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో చెప్పుకోవటానికి సరైన హిట్ లేకుండా పోయింది. సినిమా ఛాన్స్ ల కోసం ఎంతగా శ్రమించినప్పటికీ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకోలేకపోయింది.