ఈ ఫోటోలో బాలకృష్ణ పక్కన ఉన్న చిన్నారి ఎవరో తెలుసా ?
Balayya akhanda movie :సినిమా వాళ్లకు సంబంధించిన ఏ చిన్న విషయం కూడా బయటకు రాకుండా ఆగదు.అందుకే పలు వార్తలు వైరల్ అవుతాయి. ఇక సోషల్ మీడియాలో కూడా మన స్టార్స్ యాక్టివ్ గా ఉండడంతో ఫోటోలు కూడా షేర్ చేస్తుండడంతో విపరీతంగా వైరల్
ఆవుతున్నాయి. తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణతో ఓ చిన్నారి ఫోటో తెగ వైరల్ గా మారింది.
కథానాయకుడు,మహానాయకుడు మూవీస్ దెబ్బతిన్నాక సరైన హిట్ కోసం చూస్తున్న బాలయ్య ను ఎలా చూపించాలా అని బోయపాటి శ్రీనివాస్ ఓ విభిన్న చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అఖండ అనే టైటిల్ పెట్టారు. 60శాతం షూటింగ్ కూడా పూర్తయిందని టాక్. కంచె మూవీ ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ ,పూర్ణ తదితర తారాగణంతో భారీగానే తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని బాలయ్య పట్టుదలగా ఉన్నాడు.
ఇంతకీ వైరల్ అవుతున్న ఫొటోలో చిన్నారి హోలీ రోజున బాలయ్య కి రంగులు పూసి నవ్వులు చిందిస్తోంది. ఆ చిన్నారి టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులర్ అయింది. దాదాపు 10లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఆమె పేరు దీష్ణ . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి మూవీలో ఓ డైలాగ్ ద్వారా దీష్ణ బాగా పాపులర్ అయింది. అఖండ మూవీలో నటిస్తోందని,అందులోని స్టిల్ ని ఆమె తల్లి ఇంస్టా గ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది.