అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు సీరియల్ హీరోయిన్ లైఫ్ స్టైల్…అసలు నమ్మలేరు
Attarintlo akka chellellu serial Heroine Dharani :అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు సీరియల్ లో హీరోయిన్ గా చేస్తున్న ధరణి అసలుపేరు భూమిశెట్టి. 1995ఫిబ్రవరి 19న కర్ణాటక ఉడిపి జిల్లా కుందపుర గ్రామంలో జన్మించింది. ఈమెకు బ్రదర్ కార్తీక్,ఓ సిస్టర్ ఉన్నారు. తండ్రి ఉద్యోగి. తల్లి గృహిణి.26ఏళ్ల భూమిశెట్టిని ఫాన్స్ అందరూ ధరణి, మృదుల,భూమి అని పిలుస్తారు. ఈమెకు ఇంకా పెళ్లి కాలేదు. 5అడుగుల 6అంగుళాల ఎత్తుగల ఈమె 65కిలోల బరువుంటుంది.
భూమిశెట్టి సొంతూళ్లోనే స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తిచేసింది. ఏ ఎం సి ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంకనీరింగ్ పూర్తిచేసింది. యాక్టింగ్ పై అంతగా ఇంట్రెస్ట్ లేకున్నా స్కూల్ డేస్ లో కల్చరల్ ఈవెంట్స్ లో పాల్గొనేది. అలా క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. ఈమెకు పిజ్జా,ఇంట్లో తయారు చేసిన వంటలంటే ఇష్టం. ఇక మోడలింగ్ తో కెరీర్ స్టార్ట్ చేసింది. కలర్స్ కన్నడ సీరియల్ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ హిట్ కావడంతో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది.
కన్నడ సీరియల్స్ తో పాటు లంబోదరం వంటి కన్నడ సినిమాల్లో కూడా నటించిన భూమిశెట్టి నిన్నే పెళ్లాడతా సీరియల్ తో తెలుగు బుల్లెతెరపై కాలుపెట్టింది. మృదుల పాత్ర వేసి, ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే బిగ్ బాస్ కన్నడ షోలో ఛాన్స్ రావడంతో నిన్నే పెళ్లాడతా సీరియల్ ని మధ్యలో వదులుకుందని టాక్. బెంగుళూరులో ఉండే ఈమెకు ఖరీదైన కారు కూడా ఉంది. అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు సీరియల్ లో మొదట్లో చైత్ర నటించిన పాత్రలో ఇప్పుడు భూమిశెట్టి నటిస్తోంది.