టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కూతురు…ఎవరో చూడండి
Action king arjun daughter aishwarya :సినీ పరిశ్రమలో ఎంతోమంది నటీనటులు వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు. స్టార్ హీరో కూతుర్లు కూడా వచ్చారు కానీ పెద్దగా సక్సెస్ సాధించ లేకపోయారు. మంచు లక్ష్మి, కొణిదెల నిహారిక, శివాత్మిక రాజశేఖర్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ సాధించలేదు అలాగే మరో స్టార్ హీరో కూతురు కూడా ఇండస్ట్రీకి వచ్చిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. ఆమె ఎవరో కాదు యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య.
2013లో కోలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత కన్నడ పరిశ్రమలో అదృష్టాన్ని పరీక్షించుకుంది. పెద్దగా గుర్తింపు రాలేదు ఇప్పుడు టాలీవుడ్ కి పరిచయం చేయాలని అర్జున్ భావిస్తున్నాడట అర్జున్ దర్శకత్వంలోనే ఈ సినిమా ఉంటుందట ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ తో కలిసి అర్జున్ కూతురు ఐశ్వర్య ని పెట్టి టాలీవుడ్ కి పరిచయం చేయడానికి సిద్ధం అయ్యాడు. ఐశ్వర్య టాలీవుడ్ లో ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.
అర్జున్ కూతురు నటించిన తమిళ్ సినిమాలు కొన్ని తెలుగులో డబ్ అయ్యాయి. అలా ఆమె మన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించటానికి సిద్దం అవుతుంది.