MoviesTollywood news in telugu

ప్లాప్స్ లో ఉన్న హీరోలకు హిట్ ఇచ్చిన లక్కీ భామ ఎవరో…?

Telugu Heroine shruti hassan :ఇండస్ట్రీలో సెంటిమెంట్స్,చిత్ర విచిత్రాలు ఎన్నో. ముఖ్యంగా ఒక హీరోయిన్ కి వరుస ప్లాప్ లు వస్తే ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోతుంది. అందం,అభినయం ఉన్నా, అదృష్టం ఉంటేనే కదా సక్సెస్ కొట్టేది. ఇక కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ మొదట్లో నటించిన సినిమాలు దెబ్బతినడంతో చాలా అప్ సెట్ అయింది. అయితే కొన్నాళ్ళకు సీన్ రివర్స్ అవ్వడంతో ప్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్ ఇచ్చే స్థాయికి వచ్చేసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నేనొక్క‌డినే,ఆగ‌డు సినిమాల‌తో అప‌జ‌యాలతో సతమతమవుతుంటే, శ్రీ‌మంతుడు సినిమాతో హిట్ కొట్టాడు. ఇందులో మ‌హేష్ సరసన శృతిహాస‌న్ జంట‌గా నటించడం కల్సి వచ్చింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జ‌ల్సా త‌ర్వాత పులి, తీన్మార్, పంజా సినిమాలు ఫ్లాప్ కావడంతో శృతి హాస‌న్ తో క‌లిపి న‌టించిన గ‌బ్బ‌ర్ సింగ్ ఇండ‌స్ట్రీ హిట్ సాధించింది. దాంతో ప‌వ‌న్ ప్లాప్ లకు బ్రేక్ ప‌డింది. అంతేకాదు, ప‌వ‌న్ తో మూడో సినిమా గా వకీల్ సాబ్ లో చేసిన శృతి హాస‌న్ ఈ సారి కూడా ప‌వ‌ర్ స్టార్ కు హిట్ అందించింది.

జంజీర్, తుఫాన్ లాంటి డిజాస్ట‌ర్ సినిమాల త‌ర్వాత ఎవ‌డు సినిమాతో రామ్ చ‌ర‌ణ్ బంఫ‌ర్ హిట్ అందుకున్నాడంటే అందుకు అందులో నటించిన హీరోయిన్ శృతి హాస‌న్ కారణం.

అలాగే జులాయి త‌ర్వాత ఇద్ద‌రు అమ్మాయిల‌తో ప్లాప్ వచ్చిన సమయంలో రేసుగుర్రం సినిమాలో శృతిహాస‌న్ తో క‌లిసి నటించిన బ‌న్నీ హిట్ అందుకున్నాడు.

మ‌నం త‌ర్వాత ఆటోన‌గ‌ర్ సూర్య‌,ఒక లైలా కోసం,దోచెయ్ లాంటి ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న నాగ చైతన్య శృతి హాసన్ తో క‌లిసి ప్రేమమ్ సినిమా చేసి, హిట్ అందుకున్నాడు.

మిర‌ప‌కాయ్ సినిమా త‌ర్వాత వీర,నిప్పు,ద‌రువు,దేవుడు చేసిన మ‌నుషులు,సారొచ్చారు లాంటి ఫ్లాప్ లతో దెబ్బతిన్న మాస్ మహారాజు రవితేజకు శృతి హాస‌న్ జోడీ కట్టిన బ‌లుపు సినిమా హిట్ గా నిల్చింది. అంతేకాదు, రాజా ది గ్రేట్ త‌ర్వాత అట్ల‌ర్ ప్లాప్ లు ఎదుర్కొన్న ర‌వితేజకు క్రాక్ మూవీలో శృతి హీరోయిన్ కావడంతో మ‌ళ్లీ ర‌వితేజ‌కు హిట్ వచ్చినట్లయింది.