ఈ మలయాళీ బ్యూటీతో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా…?
Telugu Actress Anupama Parameswaran :తగ్గినట్టే తగ్గిన కరోనా మహమ్మారి మళ్ళీ విరుచుకు పడడంతో చాలామంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. పాక్షిక కర్ఫ్యూలు, లాక్ డౌన్ లు కూడా అమల్లోకి వచ్చేసాయి. దీంతో షూటింగ్స్ కూడా ఆగిపోయి, మళ్ళీ సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. థియేటర్లు కూడా క్లోజ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఉండే సెలబ్రిటీలు కొందరు నిత్యం పోస్టులు పెడుతూ జనంలో అవగాహన పెంచుతుంటే,మరికొందరు తమ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు వినోదం పంచుతున్నారు.
నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న రెండు సినిమాలలో అనుపమ నటిస్తోంది. ఈ రెండు సినిమాల రిజల్ట్ పైనే అనుపమ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని టాక్. చాలామంది మలయాళ హీరోయిన్లు తెలుగులో సక్సెస్ అయితే అనుపమ మాత్రం ఆ రేంజ్ లో దూసుకు వెళ్లలేకపోతోంది. గ్లామరస్, హాట్ ఫోటోలను షేర్ చేస్తున్నా సరే, ఛాన్స్ లు రావడం లేదు. ఇక ప్రేమమ్, శతమానం భవతి, రాక్షసుడు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ ఖాళీ సమయంలో తన ఇంటి దగ్గరే ఉన్న పొలంలో తపియోక దుంపలను పండించడం ద్వారా వార్తల్లో నిల్చింది.
ప్రేమమ్ బ్యూటీగా పాపులారిటీని తెచ్చుకున్న ఈ మలయాళ బ్యూటీ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు ఎక్కువగా సక్సెస్ కాలేదు. తాజాగా అనుపమ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో లోని అబ్బాయి అచ్చం అనుపమ పోలికలతోనే ఉన్నాడు.ఇంతకీ అతడు ఎవరంటే, అనుపమకు తమ్ముడు. అనుపమ తమ్ముడి పేరు అక్షయ్ అని టాక్ .అందుకే ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.