కరోనా నుంచి రక్షణ కోసం కషాయాలు ఎక్కువగా తాగుతున్నారా…రిస్క్ తప్పదు
corona kashayalu :కరోనా మహమ్మారి నుండి రక్షణ కోసం కషాయాలు తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకుని కరోనా మహమ్మారి నియంత్రించవచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే కషాయం తాగడం అనేది కొంత వరకు మాత్రమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. కషాయాలను లిమిట్ గా తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు.
ఎక్కువగా తీసుకుంటే మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు ఆ సమస్యలు ఏమిటి అనేది తెలుసు కుందాం. కరోనా సమయంలో ప్రజలందరూ అల్లం లవంగాలు మిరియాలు నీటిలో వేసి మరిగించి వడకట్టి ఆ కషాయాన్ని తాగడానికి అలవాటు పడిపోయారు.ఈ కషాయం తాగితే దగ్గు జలుబు గొంతు నొప్పి వంటివి తగ్గుతాయి.
శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే కషాయం ఎంత మోతాదులో తాగాలో తెలుసుకుందాం.అయితే రోజుకి ఒక గ్లాసు తాగితే ఈ ఫలితాలు కలుగుతాయి. మంచిది కదా అని రోజుకి రెండు నుంచి మూడు గ్లాసులు తాగితే కడుపులో గ్యాస్ ఎక్కువగా తయారయ్యి తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం వంటివి వస్తాయి. ఆహారం సరిగా జీర్ణం కాలేదు అంటే గ్యాస్ కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వెంటవెంటనే వచ్చేస్తాయి.
ఈ కషాయాలు ఎక్కువగా తాగటం వలన రక్తం పలుచగా తయారవుతుంది. కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ కషాయాలను తాగ కూడదు. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఎక్కువగా తాగకూడదు. ఏదైనా లిమిట్గా తాగితే మంచి ప్రయోజనం పొందవచ్చు. లిమిట్ దాటితే అనర్థమే జరుగుతుంది.