షూటింగ్ సమయంలో గాయపడ్డ హీరోలు…అదృష్టం బాగుండి బయటపడ్డారు
Actors who are injured in movie shooting :సినిమాల్లో కీలక సన్నివేశాల్లో, రిస్క్ సన్నివేశాల్లో డూప్ లను పెడతారు. కానీ కొందరు హీరోలు మాత్రం డూప్ అవసరం లేకుండా రిస్క్ చేస్తారు. అలాంటి సమయంలో కొన్ని సార్లు ప్రమాదం బారిన పడిన ఘటనలు ఉన్నాయి. అలాంటి వాటిని పరిశీలిస్తే, బృందావనం సినిమా షూటింగ్ స్పాట్ లో జూ.ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అయ్యింది. చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. అలాగే అదుర్స్ షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయాలపాలైనా షూటింగ్ కంప్లీట్ చేశాడు.
అదేవిధంగా రచ్చ సినిమాలో రైలు పట్టాలపై ఓ రేస్ సీన్ ఉంటుంది. ఈ సీన్ షూట్ సమయంలో ప్రమాదం సంభవించి చిన్నపాటి గాయాలతో రామ్ చరణ్ బయటపడ్డాడు. ఇక ఎవడు సినిమా షూటింగ్ క్లైమాక్స్ సీన్ లో అల్లు అర్జున్ గాయపడ్డాడు. అయితే పెద్దగా ప్రమాదం కాలేదు. బిందాస్ సినిమాలో తన స్టంట్లు తానే మంచు మనోజ్ డిజైన్ చేసుకున్నాడు. ఈనేపధ్యంలో బిందాస్ సినిమాలో ఫైట్ చేస్తున్నప్పుడు గాయాలయ్యాయి. జాను మూవీ కోసం శర్వానంద్ థాయ్ లాండ్ లో స్కై డైవింగ్ ట్రయినింగ్ తీసుకున్న సమయంలో అతడి భుజానికి గాయం అయ్యింది.
వలిమై యాక్షన్ మూవీలో హీరో అజిత్. బైక్ స్టంట్లు చేస్తుండగా ప్రమాదంలో పడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. యాక్షన్ మూవీలో గాలిలో ఉన్న బైక్ నుంచి విశాల్ కిందపడినప్పటికీ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అశ్వథామ సినిమాలో స్టంట్ చేస్తున్నప్పుడు నాగశౌర్యకు పలుచోట్ల గాయాలయ్యాయి.